Magnets | బాలుడి క‌డుపులో 100 అయ‌స్కాంతాలు.. పేగును తొల‌గించిన వైద్యులు

Magnets | పిల్ల‌ల‌కు ఎప్పుడూ ఏదో ఒకటి తినాల‌ని ఉంటుంది. ఇలాంటి వారిలో చాలా మంది పిల్ల‌లు( Children's ) ఆహార ప‌దార్థాల‌ను తింటుంటారు. కొంద‌రైతే ఆహార ప‌దార్థాల‌కు( Food Items ) బ‌దులుగా జీర్ణం కాని వ‌స్తువుల‌ను మింగేస్తుంటారు. ఆ మాదిరి ఓ బాలుడు త‌న కంటికి క‌నిపించిన ప్ర‌తి అయ‌స్కాంతాన్ని( Magnets ) మింగేశాడు. అలా త‌న క‌డుపులో 100 అయ‌స్కాంతాల‌ను పోగేశాడు. చివ‌ర‌కు ఆస్ప‌త్రి( Hospital ) పాల‌య్యాడు.

Magnets | న్యూజిలాండ్‌(New Zealand )కు చెందిన 13 ఏండ్ల బాలుడికి కొద్ది రోజుల క్రితం తీవ్ర‌మైన క‌డుపు నొప్పి వ‌చ్చింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన త‌ల్లిదండ్రులు.. కుమారుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు బాలుడికి శ‌స్త్ర చికిత్సలు నిర్వ‌హించి, స్కానింగ్ నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో భ‌యంక‌ర‌మైన విష‌యం వెలుగు చూసింది.

బాలుడి క‌డుపులో కుప్ప‌లు కుప్ప‌లుగా అయ‌స్కాంతాలు( Magnets ) ఉన్న‌ట్లు నిర్ధారించారు డాక్ట‌ర్లు. ఆ అయ‌స్కాంతాల‌న్నీ పేగుల్లో ఉండిపోయిన‌ట్లు వైద్యులు క‌నుగొన్నారు. ఇక ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా బాలుడికి వైద్యులు స‌ర్జ‌రీ నిర్వ‌హించారు. అనంత‌రం 100 అయ‌స్కాంతాల‌ను తొల‌గించారు. ఈ అయ‌స్కాంతాల వ‌ల్ల పేగుల్లోని కొంత భాగం డ్యామేజీ అయింది. దీంతో పాడైన‌ పేగు భాగాన్ని తొల‌గించి బాలుడి ప్రాణాల‌ను కాపాడారు. బాధితుడు ప్ర‌స్తుతం ఆరోగ్యంగా ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు పేర్కొన్నారు.

వాస్త‌వానికి న్యూజిలాండ్‌లో అయ‌స్కాంత విక్ర‌యాల‌పై నిషేధం ఉంది. కేవ‌లం విద్యాసంస్థ‌ల్లో మాత్ర‌మే అయ‌స్కాంతాన్ని వినియోగించుకునేందుకు వెసులుబాటు ఉంది. ఎందుకంటే విద్యార్థుల‌కు పాఠాలు బోధించే క్ర‌మంలో ప్ర‌యోగాల నిమిత్తం అయ‌స్కాంతాన్ని ఉప‌యోగించుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. అయితే బాధిత బాలుడు మాత్రం తెము అనే ఈ కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా అయ‌స్కాంతాల‌ను కొనుగోలు చేసి.. వాటిని మింగిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది. అయ‌స్కాంతాలు క‌ల‌ర్‌పుల్‌గా ఉండ‌డంతో, వాటిపై బాలుడి దృష్టి పడి ఉండొచ్చ‌ని ఓ ప్రొఫెస‌ర్ పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే వాటిని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి మింగి ఉండొచ్చ‌ని త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.