Sonali Bendre | బాలీవుడ్ నటి సోనాలి బింద్రే తెలుగులో మహేష్ బాబు, నాగార్జున, చిరంజీవి సరసన నటించిన విషయం తెలిసిందే. మహేష్ సరసన మురారి చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైంది. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు క్యాన్సర్ బారిన పడింది. ఆ తర్వాత కోలుకొని మళ్లీ సినిమాలు చేస్తుంది. అయితే ఇటీవల ఫరా ఖాన్‌తో చిట్‌చాట్‌లో తన రోజువారీ జీవనశైలి, ఆరోగ్య అలవాట్లు మరియు క్యాన్సర్‌తో చేసిన పోరాటం గురించి ఓపెన్‌గా షేర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సోనాలి క్యాన్సర్ గురించి పంచుకున్న విషయాలు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారాయి.
ఫరా జరిగిన సంభాషణలో సోనాలి క్యాన్సర్ గురించి కూడా మాట్లాడింది.2018లో, నాకు స్టేజ్-4 మెటాస్టాటిక్ క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. ఆ సమయంలో నేను నా ఆహారంలో చాలా మార్పులు చేసుకున్నాను. హెల్తీ డైట్, సమయానికి ఆహారం ఇవి నా రికవరీలో కీలక పాత్ర పోషించాయి” అని వెల్లడించింది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు క్యాన్సర్‌ను ఓడించడంలో ఎంత ఉపయోగపడ్డాయో ఆమె స్పష్టంగా చెప్పింది. సోనాలి బింద్రే పంచుకున్న ఈ హెల్త్ రొటీన్, డైటింగ్ రహస్యాలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. అయితే వైద్యులు ఈ వ్యాఖ్యలను తప్పుపట్టడంతో సోనాలి క్లారిటీ ఇచ్చారు.
తాను డాక్టర్ కాదని చెబుతూ తాను ఎవరికీ ఈ చికిత్స సూచించలేదని.. ఇది జస్ట్ తన వ్యక్తిగత అనుభవం అని పేర్కొన్నట్టు తెలియజేసింది. ప్రతి క్యాన్సర్ పరిస్థితి, వైద్యం వేరుగా ఉంటుందని, అందరూ తమకు ఏది సురక్షితమో దానిని ఎంచుకోవాలంటూ సోనాలి బింద్రే సూచించింది. క్యాన్సర్‌తో తాను చేసిన పోరాటాన్ని నిజాయితీగా పంచుకున్నట్టు స్పష్టం చేసింది. దాని వలన కలిగే, బాధ, నొప్పి ఎలా ఉంటాయో నాకు తెలుసు కాబట్టే ఈ విషయాన్ని మీ అందరికి చెప్పాను. నన్ను తప్పుగా అర్ధం చేసుకోవద్దు అంటూ సోనాలి తన సోషల్ మీడియాలో తెలియజేసింది.
