Site icon vidhaatha

Afghanistan Earthquake : అప్ఘానిస్తాన్ లో ఘోర విషాదం.. 800కు చేరిన భూకంప మృతుల సంఖ్య.. 2500 మందికి గాయాలు

Afghanistan

Afghanistan Earthquake | న్యూఢిల్లీ: అఫ్ఘానిస్తాన్ లో సంభవించిన భారీ భూకంపం ఘోర విషాదాన్ని కల్గించింది. పాకిస్థాన్‌(Pakistan) సరిహద్దులోని అఫ్గానిస్థాన్‌లోని కునార్ ప్రావిన్స్‌లో(Kunar Province) అర్థరాత్రి సంభవించిన భూకంపంతో 800 మందికిపైగా మరణించినట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ రేడియో టెలివిజన్ అఫ్గానిస్థాన్ వెల్లడించింది. మరో 2500 మంది వరకు గాయపడినట్లు పేర్కొంది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైంది. నంగర్హార్‌(Nangarhar) ప్రావిన్స్‌లోని జలాలాబాద్‌ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడైంది. 8 కిలోమీటర్ల లోతులో అది కేంద్రీకృతమై ఉంది.

ఆదివారం అర్ధరాత్రి 11.47 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. అఫ్గానిస్థాన్‌లోని కునార్‌(Kunar), నోరిస్థాన్‌(Nuristan), నంగర్హార్‌ ప్రావిన్స్‌లు(Nangarhar Province) భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. ఇళ్లు కూలిపోవడంతో ప్రజలు వీధిన పడ్డాయి. మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర గాయాలపాలై ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బాధితుల పరిస్థితి దుర్భరంగా ఉందని సమాచారం. అంతర్జాతీయ సమాజం, మానవతా సంస్థలు సత్వరమే స్పందించి బాధితులను ఆదుకోవాలని ఆ దేశం కోరుతుంది.

Exit mobile version