Site icon vidhaatha

గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్.. వాటిపై ప్రేమ‌తో 60 నిమిషాల్లో 1,123 కౌగిలింత‌లు..

ఈ ప్ర‌పంచంలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకోవాల‌నుకుంటారు. అందుకోసం చాలా మంది చాలా ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తుంటారు. ఒక వేళ వారి ప్ర‌య‌త్నం సక్సెస్ అయితే ప్ర‌పంచం గుర్తిస్తోంది. చ‌రిత్ర‌లో నిలిచిపోతారు. అయితే ఓ యువ‌కుడు కూడా ఎవ‌రూ చేయ‌ని విధంగా వినూత్నంగా ఆలోచించి గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు నెల‌కొల్పాడు. మ‌రి ఆ వినూత్న ప్ర‌య‌త్నం ఏంటో తెలుసుకుందాం..

ఆఫ్రికాలోని ఘ‌నాకు చెందిన అబుబాక‌ర్ త‌హీరు(29) ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుడు. అత‌నికి చెట్లంటే ఎంతో ప్రాణం. ఎలాగైనా త‌న‌కు చెట్ల‌పై ఉన్న ప్రేమ‌కు ప్ర‌తీక‌గా ఏదో ఒక‌టి చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. దీంతో చెట్ల‌కు కౌగిలించుకుని రికార్డు సృష్టించాల‌నుకున్నారు. ఇక ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఈ టాస్క్ పూర్తి చేసేందుకు అల‌బామాలోని ట‌స్కీగీ నేష‌న‌ల్ ఫారెస్టును ఎంచుకున్నాడు.

60 నిమిషాల్లో 1,123 చెట్ల‌ను కౌగిలించుకున్నాడు. అంటే నిమిషానికి 19 చెట్ల‌ను కౌగిలించికుని రికార్డు సృష్టించాడు. అయితే ఈ టాస్క్‌లో కౌగిలించుకున్న చెట్టును మ‌రోసారి కౌగిలించుకోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు. గిన్నిస్ నిర్వాహ‌కులు అబుబాక‌ర్ టాస్క్‌ను చాలా క్షుణ్ణంగా ప‌రిశీలించారు. అనంత‌రం అత‌నికి గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా అబుబాక‌ర్ మాట్లాడుతూ.. 60 నిమిషాల్లో 1,123 చెట్ల‌ను కౌగిలించుకుని గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు సొంతం చేసుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నాడు. ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌లో వృక్షాలు కీల‌క‌మ‌ని, వాటిని కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ ఆవ‌శ్య‌క‌త‌ను తెలియ‌జేసేందుకు ఈ టాస్క్‌ను ఎంచుకున్నాన‌ని తెలిపాడు. ఇక చెట్ల‌ను కౌగిలించుకున్న‌ప్పుడు త‌న రెండు చేతుల‌ను చెట్టు చుట్టూ ఉంచాడు. అలా చేస్తేనే నిజ‌మైన టాస్క్‌లో పాల్గొన్న‌ట్టు అని తెలిపాడు. పవిత్ర రంజాన్ మాసంలో తాను ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నాన‌ని అబుబాక‌ర్ పేర్కొన్నాడు.

Exit mobile version