విధాత: మానవ ప్రపంచం అంతరిక్షయానం సాగిస్తున్న రోజులు ఇవి. మనిషి ప్రతి సృష్టిగా రోబోలను రూపొందించి వినియోగిస్తున్న సాంకేతికత విస్తరించిన కాలం. ఈ రోజుల్లోనూ ఈ భూమి మీద ఇంకా బయటి ప్రపంచానికి తెలియని ఓ ఆదిమానవుల తెగ ఊనికి వెల్లడి కావడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది.
అమెజాన్ అడవుల్లో ఆదిమానవుల తెగ వీడియో విడుదల
అమెజాన్ అడవుల సంరక్షకుడు పాల్ రోసోలీ తాజాగా ఓ షోలో ఒక అరుదైన వీడియోను విడుదల చేశారు. బయటి ప్రపంచానికి తెలియని ఒక అపరిచిత ఆదిమ జాతి తెగకు సంబంధించిన దృశ్యాలతో ఉన్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారింది. ఈ వీడియోలో నాగరిక ప్రపంచానికి దూరంగా అమెజాన్ అడవుల్లో పూర్తిగా ఆదిమానవుల తరహాలో జీవిస్తున్న ఓ తెగను రోసోలి ప్రపంచానికి పరిచయం చేశాడు. వారంతా ఒంటిపై జంతు చర్మలతో కూడిన అచ్చాదనలు ధరించి.. జంతువుల వేట, అడవిలో దొరికే పండ్లు, కందమూలాలు వంటి వాటిని తిని జీవిస్తున్నారు.
రోసోలీ బృందం ఉనికిని అదిమ తెగ మానవులు తమకు ప్రమాదంగా భావించారు. దాడికి సిద్దపడ్డారు. అయితే వారిని మచ్చిక చేసుకుని..వారి నమ్మకాన్ని సాధించే క్రమంలో రోసోలీ బృందం ఆహారంతో కూడిన పడవను పంపగా, ఆ తెగ వాసులు తమ ఆయుధాలను దించి ఆహారాన్ని స్వీకరించారు. ఇదంతా డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు. అడవుల నరికివేత వల్ల వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, వారిని రక్షించడం అత్యవసరమని ఈ వీడియో సందేశంలో రోసోలీ ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. వారి జీవనం ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగాలంటే ప్రస్తుతం వారి అస్తిత్వ మూలాలకు విఘాతం కల్గకుండా వారితో సంబంధాలను కొనసాగించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
NEW: Never-before-seen footage of an uncontacted Amazonian tribe has been released by author Paul Rosolie on Lex Fridman’s show.
The tribe was seen lowering their weapons before they were given a canoe of food.
Rosolie is a conservationist who has reportedly spent two decades… pic.twitter.com/a0WF9O2Pof
— Collin Rugg (@CollinRugg) January 16, 2026
