విధాత:అమెజాన్ నూతన సీఈఓగా ఆండీ జస్సీ బాధ్యతలను చేపట్టారు. ఇప్పటివరకూ సీఈవోగా జెఫ్ బెజోస్ సెంటిమెంట్ ప్రకారం జూలై 5 న పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో బెజోస్ స్థానంలో జస్సీ బాధ్యతలను స్వీకరించారు.ఆండీ జస్సీకు 61 వేల షేర్లను మంజూరు చేస్తుందని అమెజాన్ ప్రకటించింది. దీని విలువ 214 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1600 కోట్లు) పదేళ్ల కాలానికి ఈ షేర్లను అతనికి కేటాయించనుంది. 300 మిలియన్ల డాలర్లు విలువైన షేర్లు ఇప్పటికే జాస్పీ సొంతం. అమెజాన్ షేర్ అధారంగా ఈ విలువ మొత్తం ఆధారపడి ఉంటుంది. అలాగే అమెజాన్ వెబ్ సర్వీసెస్ చీఫ్‌గా ఆయన అందుకుంటున్న అవార్డుల కంటే ఇది చాలా పెద్దది. అలాగే ఆండీ జస్సీ బేసిక్ వేతనం 1,75,000 డాలర్లుగా ( సుమారు కోటి, 30 లక్షల రూపాయలు) ఉండనుంది. ఇప్పటికే 45.3 మిలియన్లు షేర్లు అతని ఖాతాలోఉన్నాయి. 2020 నాటికి ఆయన పెట్టుబడుల విలువ 41.5 మిలియన్లు డాలర్లు. అయితే ఇతర టెక్నాలజీ పరిశ్రమలో ప్రత్యర్థి సీఈఓలతో పోలిస్తే జస్సీ స్టాక్ గ్రాంట్ తక్కువ అని నిపుణులు చెబుతున్నారు.
ఆపిల్ టిమ్ కుక్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ,మైక్రోసాఫ్ట్ సీఈఓ గా సత్య నాదెళ్ల అత్యున్నత పదవులను చేపట్టినపుడు ఇలాంటి స్టాక్ అవార్డులను పొందారు. మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా నియమితుడైన సత్య నాదెళ్ళ 2020 జూన్ 30 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 215 మిలియన్ డాలర్ల షేర్లను కలిగి ఉన్నారు. ఆయన మూల వేతనం 2.5 మిలియన్ డాలర్లు. కాగా 1994లో స్థాపించినప్పటి నుంచీ అప్రతిహతంగా వృద్ధి చెందిన టెక్ దిగ్గజం అమెజాన్ వాల్యూ పరంగా 1.8 ట్రిలియన్ల డాలర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరించింది. అయితే గత సంవత్సరం మెరుగైన ఫలితాలను సాధించినప్పటికీ, అమెజాన్ స్టాక్ ఫ్లాట్‌గా ఉంది.
అమెజాన్ నుండి తొలగించే స్థాయి నుండి… అమెజాన్ సీఈవోగా ఈ రోజు(జూలై 5, సోమవారం) ఆండీ జాస్సీ బాధ్యతలు స్వీకరించారు. హార్వార్డ్ బిజినెస్ స్కూల్ నుండి నేరుగా అమెజాన్‌లో జాయిన్ అయ్యారు జాసీ. 1997 లో జాసీని అమెజాన్ నుండి వెళ్లిపోవాల్సి వచ్చిన పరిస్థితుల్లో జెఫ్ బెజోస్ కాపాడారు. అమెజాన్స్ మార్కెటింగ్ డిపార్టుమెంట్‌లో పెద్దఎత్తున లే-ఆఫ్స్ జరుగుతున్న సమయంలో జాస్సీని కూడా తొలగించే పరిస్థితి వచ్చింది. కానీ బెజోస్ అతనికి అండగా నిలచారు.
ప్రస్తుతం అమెజాన్ బాధ్యతలు చేపట్టిన జాస్సీకి జెఫ్ బెజోస్ స్థానాన్ని భర్తీ చేయడం సవాలే. అమెజాన్ ప్రాఫిట్, మార్కెట్ క్యాపిటలైజేషన్, గ్లోబల్ ఫుట్ ప్రింట్ వంటి అంశాలు కీలకం. వర్కింగ్ కండిషన్స్‌ను పెంచడం నుండి కంపెనీ ఉద్యోగులతో వ్యవహరించే వరకు పలు కీలకమైన బాధ్యతలు ప్రస్తుతీ హోదాలో ఉంటాయి. మరి బెజోస్ ఎంపిక ఏమేరకు సరైనదోన్న విషయమై మరికొంత కాలం వేచిచూడాల్సిందే.