విధాత : కోట్లాది జీవరాశులకు నిలయమైన విశాల ప్రకృతిలో..మానవులు గుర్తించని జీవరాశులు ఇంకెన్ని ఉన్నాయో అంచనాకు అందనిదే. పరిశోధనలు…అన్వేషణలలో కొత్త జీవరాశుల ఉనికి వెల్లడవుతుంటే.. మానవులు ఎప్పటికప్పుడు ఆశ్చరపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా అంతులేని సముద్రాలలోని అగాధంలో నివసించే చిత్ర విచిత్ర జీవరాశులు ఎప్పటికప్పుడు ఆసక్తి రేపుతుంటాయి. తాజాగా ఇండోనేషియా సముద్ర జలా(Indonesia Ocean Discovery)ల్లో గుర్తించిన ఓ అద్బుత జీవి ఇప్పుడు వైరల్ గా మారింది. సముద్రం లోపల నీటిలో ప్రయాణిస్తున్న డ్రైవర్లు అరుదైన నీలిరంగు రిబ్బన్ ఈల్(Blue Ribbon Eel)ను చూసి ఆశ్చర్యపోయారు. పసుపు, నీలి రంగులతో కూడిన ఈల్.. రిబ్బన్ మాదిరిగా కదులుతుండటంతో రిబ్బన్ ఈల్ అని పిలుస్తున్నారు. శాస్త్రీయంగా వీటిని నీలి రిబ్బన్ ఈల్ (రైనోమురేనా క్వేసిటా)గా, ఆకుముక్కుమోరె ఈల్, బెల్నిస్ నీల్ అని కూడా పిలుస్తుంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఎక్కువగా ఇండో ఫసిఫిక్ సముద్ర జలాల్లో, పగడపు దిబ్బలలో కనిపిస్తుందని పేర్కొన్నారు.
ఇండోనేషియా సముద్ర జలాల్లో పడాంగ్‌బాయి నుండి పగడపు దిబ్బల గుండా విద్యుత్తు కాంతులతో నీలి రంగులో పసుసు మెరుపులతో మెరిసిపోతూ..సాగిపోతున్న మగ నీలి రిబ్బన్ ఈల్ (రైనోమురేనా క్వేసిటా) ను డ్రైవర్లు గుర్తించి వీడియో తీశారు. సముద్ర లోపలి జలాల్లో నీలి రిబ్బన్ అందాలు..అది సాగిపోతున్న తీరును చూసి ఆద్బుతంగా ఉందంటూ అశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన 13 సెకన్ల వీడియోను ఫాక్స్ న్యూస్ షేర్ చేయగా..అది వైరల్ గా మారింది.
అయితే అడల్ట్ రిబ్బన్ ఈల్స్ సంభోగం కోసం తోడు వెతుక్కునే క్రమంలో ప్రియురాలిని ఆకర్షించేందుకు నీలం-పసుపు రంగుల వర్ణాలను ప్రదర్శిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆడ రిబ్బన్ ఈల్ పసుపురంగుతో కనిపిస్తాయంటున్నారు. ఇండోనేషియాలోని కోరల్ ట్రయాంగిల్ ప్రపంచంలోని 76% పగడపు జాతులకు నెలవుగా ఉంది. ఐయూసీఎన్(IUCN) డేటా ప్రకారం ఇక్కడి జీవవైవిధ్యం ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలిచింది. నీలం రంగు మగ రిబ్బన్ ఈల్స్ 65నుంచి 94సెంటిమీటర్లు, పసుపురంగు ఆడ రిబ్బన్ ఈల్స్ 130సెంటిమీటర్ల వరకు పెరుగుతాయి. గుడ్లు పెట్టడం ద్వారా ఇవి తమ సంతానోత్పత్తిని చేస్తుంటాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.
‘INCREDIBLE CREATURE’: Divers are left stunned after spotting a rare blue ribbon eel in the waters off Indonesia. pic.twitter.com/GsRjGFJhoF
— Fox News (@FoxNews) November 30, 2025
