అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును హైదరాబాద్ లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాలని మంత్రి కోమటిరెడ్డి ఆహ్వానించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన కోమటిరెడ్డి చంద్రబాబును కలిసి ఆహ్వానం అందించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ఏపీ మాకు ప్రత్యేకం అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు విజన్-2020 అంటే షాకయ్యామని, కానీ ఇప్పుడు హైదరాబాద్ ని చూస్తే నిజం అనిపిస్తోందన్నారు. కరువు పరస్థితిలోనూ చంద్రబాబు తన విజన్ ను సమర్థవంతంగా అమలు చేశారని ప్రశంసించారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభివృద్దిని ముందుకు తీసుకెళ్లారని తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై విమర్శలు అప్పటి పరిస్థితుల వల్ల చేయడం జరిగిందని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు చంద్రబాబును ఆహ్వానించడానికి వచ్చానని… రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలి.. అదే స్నేహం కొనసాగాలని తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కలిసి మెలిసి ఉండాలన్నారు. నేను ఇప్పుడు ఎవర్నీ విమర్శించడం లేదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే, బుల్లెట్ ట్రైన్ రాబోతుందన్నారు. శ్రీశైలం కారిడార్ నిర్మాణం జరుగాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరడం జరిగిందని తెలిపారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ ని కలిసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఈనెల 8, 9 తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనాలని మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తమిళానాడు సీఎం స్టాలిన్ ని ఆహ్వానించారు. చైన్నైలో స్టాలిన్ ను కలిసిన ఉత్తమ్ ఆయనకు ఆహ్వానం అందించారు.
