Site icon vidhaatha

Street Girlfriends | అక్క‌డ అద్దెకు గ‌ర్ల్‌ఫ్రెండ్.. ముద్దులు, కౌగిలింత‌ల వ‌ర‌కే.. శృంగారానికి మాత్రం నో ఛాన్స్‌..!

Street Girlfriends | ఈ రోజుల్లో చాలా మంది అబ్బాయిలు( Boys ) ఒంట‌రి జీవితాన్ని గ‌డుపుతున్నారు. ఉద్యోగం లేక‌, వ‌య‌సు ఎక్కువ అవ‌డంతో.. పెళ్లిళ్లు కూడా చేసుకోవ‌డం లేదు. అలాంటి వారు తీవ్ర మాన‌సిక వేద‌న‌కు గుర‌వుతున్నారు. మ‌రికొంద‌రికి ప్రేమించేందుకు( Love ) అమ్మాయిలు దొర‌క్క‌పోవ‌డంతో.. ఒంట‌రిగా ఉండిపోతున్నారు. ఇలా ఒంట‌రి జీవితం గ‌డిపే అబ్బాయిల కోసం ఇప్పుడు స‌రికొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. అదే అద్దె గ‌ర్ల్ ఫ్రెండ్ ( Street Girlfriends ). అద్దెకు గ‌ర్ల్ ఫ్రెండ్ ఏంట‌నే అనుమానం రావొచ్చు. కానీ మీరు చ‌దువుతున్న‌ది అక్ష‌రాలా నిజ‌మే. ముద్దులు(Kiss ), కౌగిలింత‌ల(Hugs ) నుంచి మొదలు పెడితే.. క‌లిసి మ‌ద్యం సేవించ‌డం, సినిమాల‌కు( Cinema ) వెళ్లేదాకా అద్దెకు గ‌ర్ల్ ఫ్రెండ్స్( Girl Friends ) అందుబాటులో ఉన్నారు. అయితే ఒక్కో ప‌నికి ఒకో ధ‌ర‌ను నిర్ణ‌యించారు ఆ అద్దె గ‌ర్ల్ ఫ్రెండ్స్. అన్నీ ఒకే కానీ శృంగారానికి మాత్రం ఆ అద్దె అమ్మాయిలు ఒప్పుకోరు. కాక‌పోతే ఇది భార‌త్‌( India )లో కాదు చైనా( China ) లో మాత్ర‌మే..!

స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్ అనే ట్రెండ్ చైనాలో గతేడాది ఏప్రిల్ నెలలోనే వెలుగులోకి వచ్చింది. కానీ, ఇటీవలి కాలంలో ఈ విధానానికి డిమాండ్, క్రేజ్ ఎక్కువైపోయిందంటున్నారు. ఎందుకంటే చైనాలో ఒంట‌రిగా ఉండే అబ్బాయిల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగిపోవ‌డ‌మే కార‌ణం. ఈ క్ర‌మంలోనే ఒంట‌రి అబ్బాయిల కోసమే స్ట్రీట్ గ‌ర్ల్ ఫ్రెండ్ అనే కొత్త ట్రెండ్‌ను ప్రారంభించారు.

చైనాలోని షెన్జన్ నగరంలోని వీధుల్లో ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. హగ్, ముద్దు అంటూ ఒక్కో దానికి ఒక్కో ధ‌ర‌ను నిర్ణ‌యించారు. ఒక్క కౌగిలింత‌కు ఒక యువాన్ (11.54 రూపాయలు), ఒక్క ముద్దుకైతే 10 యువాన్లు (115.45 రూపాయలు) చెల్లించాల్సి ఉంటుంది. ఆమెతో క‌లిసి సినిమాకు వెళ్తే 15 యువాన్లు (173.17 రూపాయలు) ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటి పనులు చేయడానికి 20 యువాన్లు (230.88 రూపాయలు), కలిసి మందు కొట్టడానికి 40 యువాన్లు (461.77 రూపాయలు) ఇవ్వాట‌. వీరిలో కొంతమంది అబ్బాయిలతో కలిసి విహారయాత్రకు వచ్చేందుకు 100 యువాన్లు (1154.42 రూపాయలు) ఛార్జ్ చేస్తున్నట్లు నివేదిక‌లు చెబుతున్నాయి. అయితే.. ఈ వ్యాపారంలో తాము లైంగిక సంబంధాలు పెట్టుకోమని ఓ యువతి స్పష్టం చేసింది. ముద్దులు పెట్టడం, హగ్ చేసుకోవడం, కలిసి భోజనం చేయడం, సినిమాలకు వెళ్లడం మినహాయిస్తే.. అంతకుమించి హద్దుమీరమని ఆమె క్లారిటీ ఇచ్చింది. శృంగారానికి అనుమ‌తిచ్చే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చిచెప్పిందామె.

Exit mobile version