trump Vs Musk | మొన్నటి వరకు ట్రంప్ కోటరీలో సలహాదారుడిగా ఉన్న ఎలాన్ మస్క్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్ లో పోస్ట్ పెట్టాడు. బిగ్ బ్యూటిఫుల్ బిల్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న మస్క్ అమెరికాలో వ్యాపారం చేయకపోతే దుకాణం ముసేసుకోని దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా చరిత్రలో ఎవరూ పొందలేనంత సబ్సిడీలను అతను పొందాడని.. అది చూసుకోవాలన్నారు. అలాంటి వ్యక్తి తమ ప్రభుత్వంలో డీవోజీసీ(డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎఫిషియెన్సీ)లో చేశారని, ఇప్పుడు తమ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారని విమర్శించారు. ఒకవేళ సబ్సిడీలు వద్దనుకుంటే మస్క్ వ్యాపారాలు బంద్ చేసకొని.. అమెరికా వదిలి దక్షిణాఫ్రికాకు వెళ్లిపోవచ్చు అని సూచించారు అధ్యక్షుడు ట్రంప్. దీంతో రాకెట్ ప్రయోగాలు, ఎలాక్ట్రానిక్ కార్ల ఉత్పత్తి, సాటిలైట్స్ తనకు అవసరం ఉండదని.. అమెరికాకు భారీగా డబ్బులు ఆదా అవుతాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.
బిగ్ బ్యూటిఫుల్ బిల్ పాసైతే కొత్త పార్టీ పెడతా: మస్క్
అమెరికాలో ట్రంప్ తీసుకొస్తున్న బిగ్ బ్యూటిఫుల్ బిల్లు (భారీ ఖర్చుల బిల్లు) తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఈ బిల్లుపై విపక్షాలు వ్యతిరేకిస్తుండగా..బిలియనీర్ ఎలాన్ మస్క్ కూడా ఆది నుంచే బిగ్ బ్యూటిఫుల్ బిల్లును విమర్శిస్తూ వస్తున్నాడు. తాజాగా, బిగ్ బ్యూటిఫుల్ బిల్లును రుణ బానిసత్వ బిల్లుగా అభివర్ణించారు మస్క్. తనకు ట్రంప్ తో ఎలాంటి గొడవలు లేవని చెబుతున్న టెస్లా అధినేత.. ఉన్నట్లుండి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లును సెనెట్ ఆమోదిస్తే కొత్త రాజకీయ పార్టీ పెడుతానని ప్రకటించారు. తుది ఓటింగ్ ముందు ఉన్న ఈ బిల్లుపై చర్చించన వేళ టెక్ దిగ్గజం మస్క్ బిగ్ షాక్ ఇచ్చారు. అయితే, ట్రంప్‌నకు దూరం కావడానికి బిగ్ బ్యూటిఫుల్ బిల్లు కూడా కారణంగా భావిస్తున్నారు. ఈ కొత్త బిల్లు ఆమోదం పొందితే అమెరికాకు ఇప్పటికే ఉన్న అప్పుల భారానికి మరో 3బిలియన్ డాలర్లు కలుస్తాయని ఎలాన్ మస్క్ ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో వివాదస్పదంగా మారిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు పాస్ అయితే తాను అమెరికా పార్టీ పెడతానని మస్క్ తేల్చి చెప్పేశారు. దీంతో అమెరికాలో మస్క్ రాజకీయ పార్టీ పెడితే ఆ దేశ రాజకీయాలతో పాటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.