బోయింగ్‌ 737 మ్యాక్స్‌-9 విమానాలపై బ్యాన్‌ విధించిన ఎఫ్‌ఏఏ..!

అమెరికా ఎయిర్‌ సేఫ్టీ రెగ్యులేటరీ కీలక నిర్ణయం తీసుకున్నది. 170కిపైగా బోయింగ్‌ 737 మ్యాక్స్‌-9 విమానాల్లో ప్రయాణంపై నిషేధాన్ని విధించింది

  • Publish Date - January 7, 2024 / 05:08 AM IST

Boeing 737 Max | అమెరికా ఎయిర్‌ సేఫ్టీ రెగ్యులేటరీ కీలక నిర్ణయం తీసుకున్నది. 170కిపైగా బోయింగ్‌ 737 మ్యాక్స్‌-9 విమానాల్లో ప్రయాణంపై నిషేధాన్ని విధించింది. ఒరెగాన్‌ ఘటన నేపథ్యంలో చర్యలు చేపట్టింది. టేకాఫ్‌ తర్వాత విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ డోరు ఆకస్మికంగా తెరుచుకున్నది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. ఈ క్రమంలో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ బోయింగ్ 737 మ్యాక్స్-9 విమానాలపై తక్షణ విచారణకు ఆదేశించింది.


ఈ విచారణ తర్వాత మళ్లీ బోయింగ్‌ 737 మ్యాక్స్-9 విమానాల్లో మళ్లీ ప్రయాణాలు ప్రారంభంకానున్నాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం బోయింగ్ 171 విమానాలపై ప్రభావం చూపుతుంది. అలాస్కా, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ అత్యధిక సంఖ్యలో బోయింగ్ 737 మ్యాక్స్-9 విమానాలను నడుపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండు విమాన సంస్థలపై భారీగానే ప్రభావం పడనున్నది. ప్రపంచవ్యాప్తంగా 218 బోయింగ్ మ్యాక్స్ 9 విమానాలను విక్రయించినట్లు బోయింగ్ తెలిపింది. అలాస్కా ఎయిర్‌లైన్స్ శుక్రవారం నాటి ఘటన తర్వాత 65 బోయింగ్ 737 మ్యాక్స్-9 విమానాలను నిలిపివేసింది. ఇదిలా ఉండగా.. అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం గాలిలో డోర్ విరిగిపోయింది.


సంఘటన సమయంలో 171 మంది ప్రయాణికులు ఆ విమానంలో ఉన్నారు. ఎయిర్‌లైన్స్ విమానం పోర్ట్‌లాండ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, సిబ్బందికి విమానంలో తక్కువ గాలి పీడనం ఏర్పడింది. కొద్దిసేపటికే విమానం అత్యవసర ద్వారం కిటికీ పగిలిపోయింది. ఆ తర్వాత విమానం అత్యవసరంగా పోర్ట్‌ల్యాండ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ప్రస్తుతం బోయింగ్‌ మ్యాక్స్‌ విమానాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కంపెనీ వీటిని 2015లో తయారు చేసింది.


ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ 2017లో ఆమోదించింది. ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగించే విమానంగా నిలిచింది. 2018 సంవత్సరంలో ఇండోనేషియా విమానయాన సంస్థకు చెందిన బోయింగ్‌ 7373 మ్యాక్స్‌-9 తొలిసారి కుప్పకూలింది. ఈ ఘటనలో 157 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఎఫ్‌ఏఏ విమానాలను నిషేధించింది. ఆ తర్వాత కంపెనీ విమానాల్లో అనేక మార్పులు చేయగా.. మళ్లీ అనుమతి పొందింది. తాజాగా మరోసారి నిషేధానికి గురైంది.

Latest News