Vijay-Trisha | తమిళ సినీ పరిశ్రమలో నటుడు విజయ్ , నటి త్రిష కృష్ణన్ గురించి పెళ్లి పుకార్లు మరోసారి సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా పలుమార్లు ఈ ఇద్దరి గురించి ఇలాంటి వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే కొద్ది రోజులుగా ఈ చర్చలు తగ్గినట్టు కనిపించిన, తాజాగా జరిగిన ఒక చిన్న ఆన్‌లైన్ సంఘటనతో ఈ టాపిక్ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.
తమిళ హీరో విజయ్ తన భార్య సంగీతతో విడాకుల ప్రక్రియలో ఉన్నారని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఏప్రిల్ 20న జరగవచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్ భవిష్యత్ నిర్ణయాలపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ఒక ‘లైక్’తో మొదలైన కొత్త చర్చ
ఈసారి పెళ్లి పుకార్లకు కారణం ఒక చిన్నపోస్ట్‌కి లైక్ చేయడం. నటి త్రిష తల్లి ఉమా కృష్ణన్ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్టుకు ‘లైక్’ చేసినట్లు నెటిజన్లు గుర్తించారు. ఆ పోస్టులో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత విజయ్ మరియు త్రిష పెళ్లి చేసుకోవచ్చని పేర్కొనడం జరిగింది. ఈ పోస్ట్‌ను త్రిష తల్లి లైక్ చేయడంతో అభిమానులు వెంటనే దానిని స్క్రీన్‌షాట్‌లుగా షేర్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఈ ఒక్క ‘లైక్’తోనే అభిమానుల్లో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. ఇది నిజంగా ఏదైనా సంకేతమా? లేక సాధారణంగా చేసిన లైక్ మాత్రమేనా? అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి.
అధికారిక ప్రకటన లేదు
అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటివరకు విజయ్ గానీ, త్రిష గానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ప్రస్తుతం విజయ్ తన రాజకీయ ప్రయాణంపై కూడా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. తమిళనాడులో రాజకీయంగా సక్రియంగా మారుతున్న సమయంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం గమనార్హం.
మొత్తానికి విజయ్–త్రిష పెళ్లి వార్తలు నిజమా, లేక సోషల్ మీడియాలో సృష్టించిన పుకార్లేనా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ విషయంపై భవిష్యత్తులో ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
