Trisha | విజయ్ సీఎం అయ్యాక త్రిషకు 12 కోట్ల బంపర్ ఆఫర్?.. ఏకంగా ఆ మల్టీస్టారర్‌లో ఛాన్స్!
Trisha | తమిళ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మరోసారి కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలతో పాటు ఆమె వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ.. ఇప్పుడు ఆమెకు సంబంధించిన మరో భారీ సినిమా అప్డేట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
Trisha | తమిళ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మరోసారి కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలతో పాటు ఆమె వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ.. ఇప్పుడు ఆమెకు సంబంధించిన మరో భారీ సినిమా అప్డేట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి త్రిష కృష్ణన్ హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత కొంతకాలంగా విజయ్ – త్రిష మధ్య రిలేషన్‌షిప్ ఉందన్న ప్రచారం తమిళ మీడియాలో బలంగా నడుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇద్దరూ ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం వీరి పేర్లు తరచూ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.
ఉదయనిధి స్టాలిన్ నిర్మాణంలో..
ఇక ఇదే సమయంలో త్రిషకు భారీ బడ్జెట్ సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తమిళ మీడియా కథనాల ప్రకారం.. ఉదయనిధి స్టాలిన్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఓ భారీ మల్టీస్టారర్ మూవీలో త్రిషను హీరోయిన్‌గా తీసుకోవాలని మూవీ టీమ్ భావిస్తున్నట్లు సమాచారం.
రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ భారీ చిత్రంలో కమల్ హాసన్, రజినీకాంత్ కలిసి నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన గ్లింప్స్ విడుదలై మంచి హైప్‌ను క్రియేట్ చేసింది.
ఏకంగా రూ.12 కోట్ల రెమ్యునరేషన్..
ఈ చిత్రంలో నటించేందుకు త్రిష కృష్ణన్కు ఏకంగా రూ.12 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. సాధారణంగా త్రిష ఒక సినిమాకు రూ.5 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతుంటాయి. అలాంటిది ఇప్పుడు 12 కోట్ల భారీ ఆఫర్ రావడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
ప్రస్తుతం త్రిష చేతిలో ఉన్న మూడు సినిమాలు షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ భారీ మల్టీస్టారర్‌పై ఆమె ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా విజయ్ సీఎం అయిన తర్వాత తమిళనాడులో త్రిష ఇమేజ్ మరింత పెరిగిందని, అదే క్రేజ్‌ను సినిమాకు ఉపయోగించుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
అధికారిక ప్రకటన కోసం వెయిటింగ్..
ఇప్పటికే త్రిష కృష్ణన్ గతంలో కమల్ హాసన్, రజినీకాంత్ ఇద్దరితోనూ వేర్వేరు సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఈ ఇద్దరు లెజెండరీ స్టార్స్‌తో కలిసి ఒకే సినిమాలో నటించే అవకాశం రావడం ఆమె కెరీర్‌లో మరో పెద్ద మైలురాయిగా మారే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం మూవీ టీమ్ త్రిషతో సంప్రదింపులు జరుపుతోందని సమాచారం. ఈ ఆఫర్‌కు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram