Naa Anveshana | ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ నా అన్వేషణ Naa Anveshana ( అన్వేష్)కు మెటా సంస్థ షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై బ్యాన్ విధించినట్లు సమాచారం. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచ యాత్రికుడిగా పేరుపొందిన నా అన్వేష్‌కు సోషల్ మీడియాలో విశేష ఆదరణ ఉంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు సుమారు 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యం
ఇటీవలి కాలంలో భారతదేశం, హిందూ దేవుళ్లపై నా అన్వేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై పలుచోట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణలోని పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ సాగింది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసు Hyderabad City Police అధికారులు నమోదైన కేసులను సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిబంధనలు ఉల్లంఘించిన కంటెంట్‌పై చర్యలు తీసుకోవాలని మెటా సంస్థకు అధికారికంగా విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
మెటా స్పందన.. ఖాతా నిలిపివేత
పోలీసుల నివేదికల నేపథ్యంలో మెటా సంస్థ నా అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను నిలిపివేసినట్లు తెలుస్తోంది. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఉల్లంఘన, ద్వేషపూరిత వ్యాఖ్యలు లేదా మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసే కంటెంట్ కారణంగా ఈ చర్య తీసుకున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే మెటా నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
సోషల్ మీడియాలో చర్చ
నా అన్వేష్‌కు పెద్ద ఎత్తున అభిమానులు ఉండటంతో ఖాతా బ్యాన్‌పై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది సరైన చర్య అని భావిస్తుండగా, మరికొందరు ఖాతా పునరుద్ధరణ కోరుతున్నారు. ఆ మధ్య యూట్యూబ్ సబ్‌స్క్రైబర్స్ కూడా చాలా మంది తగ్గడం మనం చూశాం. ఈ పరిణామం సోషల్ మీడియా వేదికలపై కంటెంట్ బాధ్యత, చట్టపరమైన పరిమితులపై మరోసారి చర్చకు దారి తీసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం మరింత ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
