Indore EV Charge Blast :పేలిన ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ పాయింట్..8 మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఎలక్ట్రిక్ వాహనం చార్జింగ్ పాయింట్ పేలి మంటలు చెలరేగిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి చెందారు. గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.

Indore EV charging point blast

విధాత : ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే కాదు..వాటి చార్జింగ్ పాయింట్ లు కూడా పేలిపోతూ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఎలక్ట్రిక్‌ వాహనం ఛార్జింగ్‌ పాయింట్‌ పేలి మంటలు చెలరేగిన ఘటనలో ఒకే కుటుంబంలో ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంటల తీవ్రతకు ఇంట్లోని గ్యాస్‌ సిలిండర్లు సైతం పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.

ఈ ఘటనలో భవనంతో పాటు అందులోని ఫర్నిచర్‌, ఇంటి ఆవరణలో నిలిపి ఉంచిన కార్లు, బైక్‌లు కూడా దగ్ధమయ్యాయి. భవనం ముందు ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ సైతం పేలిపోవడంతో అక్కడ విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.ఈ ఘటన ఎలక్ట్రిక్ వెహికల్స్ పట్ల జనంలో మరోసారి భయాందోళనలను రేకెత్తించింది. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

ఇవి కూడా చదవండి :

Peddi | ‘పెద్ది’లో రామ్ చరణ్‌తో స్పెషల్ సాంగ్… ఇద్దరు టాప్ హీరోయిన్లతో గ్రాండ్ ప్లాన్!
Raashii Khanna | లెహంగా అందాలతో గిలిగింతలు పెడుతున్న రాశి ఖన్నా!

Latest News