Peddi | ‘పెద్ది’లో రామ్ చరణ్‌తో స్పెషల్ సాంగ్… ఇద్దరు టాప్ హీరోయిన్లతో గ్రాండ్ ప్లాన్!
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో ముఖ్యంగా ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో ముఖ్యంగా ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే పలువురు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆ పాటలో ఏ హీరోయిన్ కనిపిస్తుందో, హీరో వేసే స్టెప్పులు ఎలా ఉంటాయో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఉంటుంది. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ‘పెద్ది’ చిత్ర బృందం స్పెషల్ సాంగ్ కోసం భారీ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఇద్దరు భామలతో చిందులు..
ఈ పాటను మరింత కలర్‌ఫుల్‌గా, గ్రాండ్‌గా చూపించేందుకు ఏకంగా ఇద్దరు టాప్ హీరోయిన్లను రంగంలోకి దించాలనే ఆలోచనలో దర్శకుడు బుచ్చిబాబు ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ఒక స్టార్ హీరోయిన్ ఉంటేనే థియేటర్లు కేకలతో మార్మోగిపోతాయి. అలాంటిది ఇద్దరు భామలతో రామ్ చరణ్ చిందేస్తే ఆ సాంగ్ మరో లెవల్‌లో ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట.
ప్రస్తుతం ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు అన్న విషయంపై చిత్రబృందం తీవ్రంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఈ భారీ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
హైలైట్ కానున్న సాంగ్..
అద్భుతమైన డాన్స్‌కు పేరుగాంచిన రామ్ చరణ్ కోసం ఈ పాటలో ప్రత్యేకంగా స్టైలిష్ స్టెప్పులను కొరియోగ్రాఫ్ చేస్తున్నారని తెలుస్తోంది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ హైలైట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే ‘పెద్ది’పై ఉన్న అంచనాలు భారీగా ఉండగా, ఈ స్పెషల్ సాంగ్ వార్తతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. మరి రామ్ చరణ్‌తో ఆడిపాడే ఆ ఇద్దరు లక్కీ హీరోయిన్లు ఎవరో తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram