జర్నలిస్ట్ ల అక్రిడిటేషన్లపై మంత్రి పొంగులేటి బిగ్ అప్డేట్

జర్నలిస్టుల అక్రిడిటేషన్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. నిజమైన జర్నలిస్టులకు కార్డులు ఇస్తామని, త్వరలో డిజిటల్ మీడియా పాలసీ తీసుకొస్తామని తెలిపారు.

ponguleti srinivas

విధాత, హైదరాబాద్ : జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బుధవారం శాసనమండలిలో ప్రశ్నొత్తరాల సమయంలో పలువురు విపక్ష సభ్యులు జర్నలిస్టు సమస్యలపై అడిగిన ప్రశ్నలకు మంత్రి పొంగులేటి సమాధానం ఇచ్చారు. డెస్క్, ఫీల్డ్ జర్నలిస్టులను వేరు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని, నిజమైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలన్నదే మా లక్ష్యం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

అక్రిడిటేషన్ల విషయంలో ప్రభుత్వం తొలుత 252 జీవోను ఇచ్చిందని, అయితే జర్నలిస్టు సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలతో ఆ జీవోను సవరించి ఇచ్చామన్నారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయంలో కొంత మంది లేనిపోని అపోహలను సృష్టిస్తున్నారు. అందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఓ కమిటీని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఇంకా ఏవైనా సవరణలు చేయాల్సిన అవసరం ఉంటే సర్క్యులర్ జారీ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం భేషజాలకు వెళ్లబోదన్నారు.

రెండు నెలల్లో డిజిటల్ మీడియా పాలసీ

వచ్చే రెండు, మూడు నెలల్లో డిజిటల్ మీడియా పాలసీని తీసుకు రాబోతున్నామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పాలసీ ఓ రూపానికి తీసుకువచ్చామని త్వరలోనే ఫైనల్ చేస్తామన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. కోర్టుల్లో ఆటంకాలు లేకుండా ఇళ్ల స్థలాల పంపిణీకి యోచిస్తున్నామన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ఇటీవల మహిళా దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారని అతి కొద్దిరోజుల్లోనే ఆ తీపికబురు వినిపిస్తామన్నారు. జర్నలిస్టుల ఉద్యోగాల భద్రతా విషయంలో ఈ ప్రభుత్వం వెనకడుగు వేయబోదని భరోసా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణలో 2029లోనే అసెంబ్లీ ఎన్నికలు : సీఎం రేవంత్ రెడ్డి
Peddi | ‘పెద్ది’లో రామ్ చరణ్‌తో స్పెషల్ సాంగ్… ఇద్దరు టాప్ హీరోయిన్లతో గ్రాండ్ ప్లాన్!

Latest News