తెలంగాణలో 2029లోనే అసెంబ్లీ ఎన్నికలు : సీఎం రేవంత్ రెడ్డి

జనగణన, డీలిమిటేషన్ ప్రభావంతో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే జరిగే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్ కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

తెలంగాణలో 2029లోనే అసెంబ్లీ ఎన్నికలు : సీఎం రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ : జనగణన, డీలిమిటేషన్ వంటి జాతీయ స్థాయి పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో 2028లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం కనిపించడం లేదని, 2029లోనే జమిలి ఎన్నికలు రావచ్చని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి బుధవారం మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు.తెలంగాణలో డ్రగ్స్ కేసులపై రేవంత్ రెడ్డి స్పందించారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసులో ఇప్పటికే 9 మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పట్టుబడ్డారని, ఆయన పార్లమెంటు సమావేశంలో నేపథ్యంలో స్టేషన్ బెయిల్ మీద బయట తిరుగుతున్నారు అని తెలిపారు. ఈ వ్యవహఆరంలో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదు అని, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణే లక్ష్యంగా మా ప్రభుత్వం ఈగల్ టీమ్ వ్యవస్థలను ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. డ్రగ్స్ సరఫరా, వినియోగాలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న లోపాలను సరిదిద్దుతున్నామని, వ్యవస్థను ప్రక్షాళణ చేస్తున్నామని పేర్కొన్నారు. డ్రగ్స్ వ్యవహారాలలో ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని అని, ఇలాంటి కేసుల్లో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

తగ్గిన బంగారం ధరలు
షాంపూలు మానేస్తే ఏమవుతుంది? జుట్టులో వచ్చే మార్పులు ఇవే!