తగ్గిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,57,750కి చేరగా, వెండి ధర కిలోకు రూ.2,75,000కి పడిపోయింది. గ్లోబల్ పరిణామాల ప్రభావంతో ధరల్లో మార్పులు కొనసాగుతున్నాయి.

Reported by: Tejaswini Nanna | వాణిజ్యం | Mar 18, 2026, 2:18 pm IST
Read Time: 3 mins
తగ్గిన బంగారం ధరలు

విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు మరోసారి మార్పులకు లోనయ్యాయి. బుధవారం బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 330 తగ్గి, రూ. 1,57,750కి దిగి వచ్చింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 300 తగ్గి, రూ.1,44,600వద్ద కొనసాగుతుంది. వెండి ధరలు సైతం మరోసారి తగ్గుదలను నమోదు చేశాయి. కిలో వెండి ధర రూ. 5,000తగ్గి రూ. 2,75,000 వద్ద కొనసాగుతుంది.

బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా నెలకున్న పరిస్థితుల మధ్య విపరీతమైన మార్పులకు లోనవుతున్నాయి. ఓ రోజు పెరిగి.. మరోరోజు పడిపోతున్నాయి. పెట్టుబడిదారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పెళ్లిళ్లు వంటి శుభా కార్యాలకు సైతం పసిడి ప్రియులు బంగారాన్ని కొనుగోలు తక్కువ మోతాదులో ప్రస్తుత అవసరాల మేరకు కొనుగోలు చేస్తున్నారు. అంతర్జాతీయంగా నెలకున్న ఆందోళనకర పరిస్థితులు, ఇరాన్ యుద్ధ ప్రభావం బంగారం కొనుగోలుదారులను గందరగోళానికి గురి చేస్తుంది. ధరలు కొంత తగ్గినప్పటికి సామాన్యులు బంగారం కొనే పరిస్థితులు కనపటడం లేదు. మరింత తగ్గవచ్చన్న ఆలోచనతో కొనుగోలుదారులు వేచి చూసే ధోరణి కొనసాగిస్తున్నారు. అయితే మార్కెట్ నిపుణులు మాత్రం బంగారం, వెండి ధరల తగ్గుదల తాత్కాలికమేనని, దీర్ఘకాలికంగా పెరుగదల నమోదు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

షాంపూలు మానేస్తే ఏమవుతుంది? జుట్టులో వచ్చే మార్పులు ఇవే!
పలు భాషల్లోకి ‘వనజీవి రామయ్య’ బయోపిక్