Nayantara | నాకు నయనతార కావాలంటూ ఎంపీ ఘాటు వ్యాఖ్య‌లు… ఖుష్బూ, నడిగర సంఘం తీవ్ర ఆగ్రహం

Nayantara | తమిళనాడులో ఎన్నికల వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో రాజకీయ చర్చల్లో సినీ తారలను లాగడం మరోసారి వివాదానికి దారితీసింది.

Nayantara | తమిళనాడులో ఎన్నికల వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో రాజకీయ చర్చల్లో సినీ తారలను లాగడం మరోసారి వివాదానికి దారితీసింది. ఇటీవల హీరోయిన్ త్రిషపై చేసిన వ్యాఖ్యలు ఇంకా హాట్ టాపిక్ అవుతూనే ఉండగా, తాజాగా ప్రముఖ నటి నయనతారపై ఒక ఎంపీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

మహిళల భద్రత అంశంపై విల్లుపురంలో ఎన్డీయే కూటమి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అన్నాడీఎంకే నేత, రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ అందరి కలలను నెరవేర్చుతానని చెబుతున్నారని, తనకు నయనతార కావాలనే కోరికను కూడా నెరవేర్చుతారా? ఎవరైనా నయనతారను పెళ్లి చేసుకోవాలని అనుకుంటే వారి కలను కూడా సాకారం చేస్తారా? అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, సామాజికంగా తీవ్ర విమర్శలకు దారి తీశాయి.

సినీ తారలపై వ్యాఖ్యలు సహించం: నడిగర సంఘం

ఈ వ్యాఖ్యలపై దక్షిణ భారత సినీ నటుల సంఘం ‘నడిగర సంఘం’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బాధ్యత గల పదవిలో ఉన్న నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని పేర్కొంది. సినీ తారలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని స్పష్టం చేసింది. ఎంపీ సీవీ షణ్ముగం వెంటనే నయనతారకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నడిగర సంఘం డిమాండ్ చేసింది.

మహిళలను ఇలా లక్ష్యంగా చేయొద్దు: ఖుష్బూ

ఈ వివాదంపై బీజేపీ సీనియర్ నాయకురాలు, సినీనటి ఖుష్బూ కూడా స్పందించారు. మహిళలు లేదా నటీమణులు ఎవరికి నచ్చినట్టు మాట్లాడుకునే వస్తువులు కారని ఆమె స్పష్టం చేశారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను విమర్శించడానికి మహిళల పేర్లను లాగడం సరికాదని ఆమె పేర్కొన్నారు. హాస్యం కోసం అయినా మహిళలను ఇలా ప్రస్తావించడం తగదని ఖుష్బూ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ప్రతి మగవాడు ఒక స్త్రీకి పుట్టాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె సూచించారు. ఒకసారి తమ తల్లి, సోదరి, భార్య లేదా కుమార్తె గురించి ఎవరైనా ఇలాగే మాట్లాడితే ఎలా ఉంటుందో నాయకులు ఆలోచించుకోవాలని ప్రశ్నించారు.

నటీమణులకు ఫాలోయింగ్ ఉన్నంత మాత్రాన వారు ప్రజల ఆస్తి కాదని, ఇతర రంగాల్లో ఉన్న మహిళలను ఎలా గౌరవిస్తారో సినీ పరిశ్రమలో ఉన్న వారినీ అలాగే గౌరవించాలని ఖుష్బూ పేర్కొన్నారు. గౌరవం అనేది వృత్తిపై ఆధారపడి ఉండకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. ఎంపీ చేసిన వ్యాఖ్యలు కేవలం మహిళా నటీమణులను అవమానించడమే కాకుండా, మాట్లాడిన వారి వ్యక్తిత్వాన్ని కూడా బయటపెడతాయని ఖుష్బూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు మానవత్వానికే అవమానకరమని ఆమె అన్నారు. గౌరవం అనేది ఎప్పుడూ పరస్పరం ఉండాలని ఖుష్బూ స్పష్టం చేశారు.

Latest News