అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా వృత్తినిపుణులు, విద్యార్థులు, కంపెనీలను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఇప్పటివరకు 2,000 నుండి 5,000 డాలర్ల మధ్య ఉన్న H-1B వీసా రుసుములు ఇప్పుడు ఒక్కసారిగా ఏడాదికి 100,000 డాలర్లకు పెరగడం పెద్ద కలకలం రేపుతోంది.
ఈ ఫీజు పెంపు వల్ల ఎవరు ప్రభావితమవుతారు? ఇప్పటికే అమెరికాలో ఉన్నవారికి వర్తిస్తుందా? కొత్తగా వెళ్ళేవారికి ఏం జరుగుతుంది? స్టూడెంట్స్, కంపెనీలు, స్టార్టప్‌ల పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. మన తెలుగు పిల్లలే చాలామంది హెచ్1బి వీసా మీద అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఏం జరగబోతోందోనని ఇక్కడ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అందుకని, పాఠకులకు స్పష్టత ఇవ్వడానికి ముఖ్యమైన సందేహాలు ఇంకా సమాధానాలు (FAQs) ఇక్కడ అందిస్తున్నాం.
జవాబు: అమెరికాలో ప్రత్యేక నైపుణ్యం (Speciality Occupation) అవసరమయ్యే రంగాల్లో (IT, ఇంజినీరింగ్, మెడికల్, రీసెర్చ్) విదేశీ నిపుణులను నియమించుకునే సౌకర్యం కల్పించేదే హెచ్1బి వీసా. సంవత్సరానికి 65,000 సాధారణ H-1B వీసాలు, 20,000 మాస్టర్స్ కేటగిరీ వీసాలు ఇస్తారు. వీటిలో 70% కంటే ఎక్కువ భారతీయులదే వాటా.
జవాబు: ఇప్పటి వరకు ఫీజులు 2,000 డాలర్ల నుంచి 5,000 డాలర్ల మధ్య ఉండేవి. కంపెనీ పరిమాణం, ఇతర నిర్వహణ ఖర్చులపై ఆధారపడి అటూఇటూ మారేవి. ఇప్పుడు ట్రంప్ నిర్ణయం ప్రకారం హఠాత్తుగా ఏడాదికి 1,00,000 డాలర్లకు పెంచారు.
జవాబు:
జవాబు: ఇది ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన ఫీజు. అంటే 3 సంవత్సరాల వీసా కాలానికి 3,00,000 డాలర్లన్నమాట.
జవాబు: నియమాల ప్రకారం వీసా ఫీజులను కంపెనీ మాత్రమే చెల్లించాలి. ఉద్యోగి నుండి వసూలు చేయడం అమెరికా కార్మిక చట్టాల ప్రకారం కుదరదు. అయితే పరోక్షంగా కంపెనీలు దీన్ని ఖర్చులలో చూపించి, ఉద్యోగి జీతభత్యాలలో కోత విధించే అవకాశం ఉంది.
జవాబు: లేదు. అమెరికాలోనే ఉండి ఎక్స్‌టెన్షన్ లేదా కంపెనీ మార్పు చేసుకునే వారికి ఈ కొత్త ఫీజు వర్తించదు. కానీ అమెరికా బయటకెళ్లి తిరిగి ప్రవేశించే సమయంలో మాత్రం ఈ ఫీజు వర్తించే అవకాశం ఉంది.
జవాబు: వారు అమెరికాలోపలే మార్చుకుంటే ఈ ఫీజు వర్తించదు. కానీ ఎవరైనా భారతదేశం లేదా ఇతర దేశం నుంచి కొత్తగా H-1Bలో రావాలనుకుంటే మాత్రం 1,00,000 డాలర్ల బాదుడు తప్పదు.
జవాబు: “జాతీయ అవసరాల” కింద కొంతమందికి మినహాయింపులు ఇవ్వవచ్చు. ఉదాహరణకు ఆరోగ్య రంగ నిపుణులు, ముఖ్య పరిశోధనలో ఉన్నవారు. కానీ ఈ మినహాయింపులపై ప్రస్తుతానికి ఎటువంటి స్పష్టతా లేదు.
జవాబు: సెప్టెంబర్ 21, 2025 అర్థరాత్రి 12:01 (ET) నుంచి అమల్లోకి వస్తుంది. అంటే తక్షణమే ప్రభావం చూపనుంది.
జవాబు: భారతీయులు H-1B వీసాల్లో 71% వాటా కలిగి ఉన్నారు. కాబట్టి ప్రధానంగా మనకే ఎక్కువుంటుంది. కొత్తగా అమెరికా వెళ్లే టెకీలు, విద్యార్థుల కెరీర్ ప్లాన్లపై ఇది పెను ప్రభావం చూపనుంది.
జవాబు:
జవాబు: చేయొచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం 1,00,000 డాలర్ల H-1B ఫీజు నిర్ణయం కోర్టులో సవాలు చేయబడే అవకాశం ఖాయం. ఎందుకంటే,
తుది నిర్ణయం ఇంకా న్యాయపరమైన సవాళ్లతో అనిశ్చితిలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం కంపెనీలు, ప్రొఫెషనల్స్, విద్యార్థులు మాత్రం కొంత జాగ్రత్తగా వ్యవహరించడమైతే తప్పనిసరి. ఈ ఫీజు నిర్ణయం అమలవుతుందా? లేదా అనేది కోర్టుల్లోనే తేలుతుంది. కాబట్టి తుది ఫలితం కూడా కోర్టు తీర్పులపై ఆధారపడి ఉంటుంది.