హెజ్బుల్లా(Hezbullah) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధినేత, హషీమ్ సఫియుద్దీన్ (Hashem Safieddine-60) ఆచూకీ తెలియరావడం లేదని లెబనాన్ ప్రభుత్వం, హెజ్బుల్లాకు సంబంధించిన వర్గాలు తెలిపాయి. శుక్రవారం నాడు ఇజ్రయెల్ దక్షిణ లెబనాన్‌లోని హెజ్బుల్లా స్థావరాలను లక్ష్య్ంగా చేసుకుని చేసిన దాడుల (Israel attacks on Friday) తర్వాత హషీమ్‌తో సంబంధాలు తెగిపోయినట్లు తెలుస్తోంది. దాదాపుగా ఆయన ఆ దాడుల్లో మరణించినట్లు(feared dead)గానే భావిస్తున్నారు. అయితే ఈ వార్త ఇంకా ఎవరూ ధృవీకరించలేదు.
హెజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా(Hassan Nasrallah) ఇజ్రాయెల్ దాడుల్లో హతమైన తర్వాత సంస్థ అధినేతగా హషీమ్ సఫియుద్దీనే వ్యవరిస్తారని లెబనాన్ వర్గాలను ఉటంకిస్తూ పలు వార్తాసంస్థలు తెలిపాయి. భవిష్యత్ అధినేత కూడా ఇప్పుడు హతం(?) కావడంతో హెజ్బుల్లాకు మరో భారీ నష్టం వాటినట్లయింది.
ఓ పక్క, ఇరాన్(Iran) దాడులు చేస్తున్నా, ఇజ్రాయెల్ లెబనాన్‌పై భూతల, గగనతల దాడులను కొనసాగిస్తోంది. హెజ్బుల్లా అంతమే తమ పంతమన్నట్లు నెతన్యాహు(Benjamin Netanyahu) శాశ్వతంగా శత్రవును నాశనం చేయాలని చూస్తున్నారు. ఇజ్రాయెల్ వ్యూహాలు, దాడులతో హెజ్బుల్లా ఇప్పటికే భారీగా నష్టపోయింది. దాదాపుగా సంస్థ పతనం దిశగా పయనిస్తోందని పశ్చిమాసియా అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడ్డారు.
హషీమ్ సఫియుద్దీన్ హసన్ నస్రల్లాకు తల్లి తరపు(Maternal Coursin) సమీప బంధువు. ఇద్దరూ కలిసి ఇరాన్లో చదువుకున్నారు. నస్రల్లా లాగే హషీమ్ కూడా ఇజ్రాయెల్‌కు బద్ధశత్రువు. ఇరాన్ అత్యున్నత అధికార వర్గాలతో చాలా సన్నిహిత సంబంధాలు కలిగిఉన్నవాడు. హెజ్బుల్లాలో నస్రల్లా తర్వాత అంతటి శక్తివంతుడు హషీమే. పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల తర్వాత హషీమ్ మాట్లాడుతూ, చివరి వరకు మేము వెనుదిరిగే ప్రసక్తే లేదని ప్రకటించాడు.