Music Mapping Neurosurgery : వండర్..గీటార్ వాయిస్తుండగానే బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ !

గిటార్ వాయిస్తూ.. పాట పాడుతూ బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్! బ్రెజిల్‌లో వైద్యుల అద్భుత ప్రయోగం. జ్ఞాపకశక్తి, మాట పడిపోకుండా లైవ్ మ్యూజిక్ మ్యాపింగ్.

Musician plays guitar during brain surgery

విధాత : రోగులకు టీవి చూపిస్తూ వైద్యులు ఆపరేషన్లు చేసిన ఘటనలు గతంలో చూశాం. తాజాగా ఓ వ్యక్తికి గిటార్ వాయిస్తూ పాట పాడుతుండగానే అతనికి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేయడం సంచలనంగా మారింది. బ్రెజిలియన్ సంగీతకారుడికి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అనివార్యమూంది. వైద్యులు ఆ పేషెంట్ పాట పాడుతూ, గిటార్ వాయిస్తూ కొనసాగించాడు. బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ జరుగుతుండగానే ఆ పేషెంట్ పాట పాడుతూ, గిటార్ వాయిస్తూ ఆరు పాటలు పాడినట్లుగా సమాచారం. ఈ లైవ్ మ్యూజిక్ ఆపరేషన్ వీడియో వైరల్ గా మారింది.

మూవ్‌మెంట్ , స్పీచ్‌కు సంబంధించిన భాగాలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడటానికి డాక్టర్లు అతడిని అలాగే తన గీటార్ వాయిద్యంతో పాట పాడటం కొనసాగించాలని సూచించారు. లైవ్‌గా బ్రెయిన్ ఫంక్షన్స్ చెక్ చేయడానికి ఇది కీలకంగా మారిందని వైద్యులు వెల్లడించారు. యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్‌లో 2021 సమీక్షలో 93% కేసులలో సంగీత మ్యాపింగ్ తో ఆపరేషన్లు సాధ్యమని పేర్కొనడం ఈ సందర్బంగా ఆసక్తికరం.

ఇవి కూడా చదవండి :

New Chief Secretary Race | తెలంగాణ తదుపరి సీఎస్‌ ఎవరో? రేస్‌లో ఐదుగురు ఐఏఎస్‌లు…
Rythu Bharosa Funds | రైతు భరోసా నిధుల విడుదల కేబినెట్ ముగిశాకే..!

Latest News