విధాత : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ట(Trump), రెండోసారి అధికారంలోకి వచ్చాక భారత్(India) వ్యతిరేక విధానాలతో తన అక్కసు వెళ్లగక్కుతునే ఉన్నారు. 50శాతం సుంకాల విధింపుతో పాటు భారత్ పై పలు ఆంక్షలతో భారత్ ను దెబ్బతీసే వైఖరిని వరుసగా చాటుకుంటు వస్తున్నారు. తాజాగా భారత్ ను ఓ డ్రగ్స్ ఉత్పత్తి(India drug hub) కేంద్రం అంటూ తీవ్ర ఆరోపణలతో నోరుపారేసుకున్నాడు. ఎషియన్ దేశాలే డ్రగ్స్ కేంద్రాలు అన్నట్లుగా విమర్శలు చేశారు.
భారత్‌సహా 23 దేశాలు అక్రమంగా డ్రగ్స్‌ను ఉత్పత్తి చేస్తున్నాయని, రవాణా స్థావరాలుగా వ్యవహరిస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. భారత్ తో పాటు చైనా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లూ(drug trafficking countries) ఈ జాబితాలో ఉన్నాయన్నారు. ఈ దేశాలు అక్రమ డ్రగ్స్‌ను, అందులో వాడే రసాయనాలను ఉత్పత్తి, రవాణా చేస్తూ అమెరికా ప్రజల భద్రతకు ముప్పుగా పరిణమించాయంటూ నిందలు వేశారు. అమెరికన్ కాంగ్రెస్‌కుసమర్పించిన ‘ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్’ నివేదికలో ట్రంప్ ఈ ఆరోపణలు చేశారు. భారత్, పాకిస్థాన్, చైనా, అఫ్గానిస్థాన్, ద బహమాస్, బెలీజ్, బొలీవియా, బర్మా, కొలంబియా, కోస్టారికా, ద డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా, హైతీ, హోండురస్, జమైకా, లావోస్, మెక్సికో, నికరాగువ, పనామా, పెరూ, వెనెజువెలా దేశాలు ప్రధానంగా డ్రగ్స్‌ను ఉత్పత్తి చేయడంతోపాటు రవాణా చేస్తున్నాయని ఈ నివేదికలో ఆరోపించారు.