World War III | జూన్​ 18న మూడో ప్రపంచయుద్ధానికి ముహుర్తం?

మూడో ప్రపంచయుద్ధం కొన్ని రోజుల్లోనే ఉందని, దాదాపుగా జూన్​ 18న ప్రారంభమయ్యే సూచనలున్నాయని ప్రముఖ భారతీయ జ్యోతిష శాస్త్రవేత్త కుశాల్​కుమార్​ బ్రిటిష్​ ‘డైలీ స్టార్’​(Daily Star)  పత్రికకు తెలిపారు.

  • Publish Date - June 17, 2024 / 08:14 AM IST

నిజమేనా..? మూడో ప్రపంచయుద్ధాని(3rd World War)కి ముహుర్తం వచ్చేసిందా? అవుననే అంటున్నాడు కుశాల్​ కుమార్(Kushal Kumar)​. ఈయన హర్యానా, పంచకుల, సెక్టార్​20లో నివసిస్తున్నారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఘటనలను తను ముందే వైదిక జ్యోతిష పటం (Vedic Astrological map) ద్వారా ఊహించానని చెప్పారు. వేద జ్యోతిష్యం అనేది హిందూ సంస్కృతి, ధర్మాల్లో పాతుకుపోయిన శాస్త్రం. గ్రహాల కదలికలు, నక్షత్ర స్థానభ్రంశాలను ఆధారంగా చేసుకుని ఈ శాస్త్రం భవిష్యత్తును ఊహిస్తుంది(Prediction). కుశాల్​కుమార్​ ఇజ్రాయెల్​–హమాస్​, చైనా–తైవాన్​, రష్యా–నాటోల మధ్య ఉద్రిక్తతలను ముందే ఊహించి చెప్పాడు.

మూడో ప్రపంచయుద్ధం(World War III) గురించి , కుశాల్​కుమార్​ ‘డైలీస్టార్’​ కు తెలిపిన దాని ప్రకారం, 2024వ సంవత్సరం చాలా బాధాకరంగా ఉంటుందని, ప్రపంచవ్యాప్తంగా ఎగసే ఉద్రిక్తతలు దీనికి కారణమవుతాయని, ముఖ్యంగా మే 8వ తేదీ చుట్టుపక్కల చాలా ఘటనలు సంభవిస్తాయని తెలిపారు. ఇంకా, ఉత్తర–దక్షిణ కొరియా, చైనా–తైవాన్​, మధ్యప్రాచ్యం, యుక్రెయిన్​–రష్యాల మధ్య ఘర్షణలు మరింత ముదిరే అవకాశముందని ఆయన హెచ్చరించారు. కుమార్​ అంచనా ప్రకారం, గ్రహాల పెను ప్రభావం వల్ల జూన్​ 18, 2024(June 18, 2024)న మూడో ప్రపంచయుద్ధం మొదలయ్యే అవకాశముందని, అటువంటిదే జూన్​ 29న కూడా సంభవించొచ్చని ఆయన చెప్పారు.

ఇప్పుడు కుశాల్​ కుమార్​ను కొత్త నోస్ట్రడామస్​( New Nostradamus)గా, భారత నోస్ట్రడామస్​(Indian Nostadamus) గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ ఫ్రెంచ్​ జ్యోతిష్యుడు నోస్ట్రడామస్(​, క్రీ.శ. 1555లో ప్రచురించబడిన తన గ్రంథం ‘ది ప్రొఫిసీస్​’(The Prophecies)లో 942 పద్యాల రూపంలో భవిష్యత్ సంఘటనలను విపులీకరించాడని చెబుతారు. వీటిలో చాలా మటుకు నిజమయ్యయని కూడా ఉదాహరణలతో సహా చాలామంది నిరూపించారు. వీటిలో ఫ్రెంచ్​ విప్లవం, హిట్లర్​, రెండు ప్రపంచయుద్ధాలు, హిరోషిమా, నాగసాకి అణుబాంబు దాడులు ఉన్నాయి.

కుశాల్​కుమార్​, తను చెప్పిన భవిష్యవాణిని నేడు పునరుద్ఘాటించారు. జూన్​18న 3వ ప్రపంచ యుద్ద ప్రారంభానికి చాలా అవకాశాలున్నాయన్న ఆయన, ఈమధ్య జరిగిన సంఘటనలను ఉదహరించారు. భారత్​లో ఉగ్రదాడులు(Terror Attacks on India), ఉత్తర కొరియా(North korea) సైనిక విన్యాసాలు, ఇజ్రయెల్​–లెబనాన్​ల మధ్య ఉద్రిక్తతలను సూచనలుగా అభివర్ణించారు. నిజానికి మే నెలలోనే కుశాల్​కుమార్​ ఇవన్నీ చెప్పాడు.  హెలీకాప్టర్​ ప్రమాదంలో ఇరాన్​ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(Ebrahim Raisi) మరణించిన తర్వాత ఆయన ఈవిధంగా స్పందించాడు.  మీడియం అనే బ్లాగ్​లో ఆయన రాసినదాని ప్రకారం, జూన్​ 29వ తేదీ మరో ప్రమాదకరమైన దినంగా సూచించాడు. ప్రపంచయుద్ధమనేది ఎప్పుడైనా, ఎలాగైనా ప్రారంభం కావచ్చు. ఒక అనాలోచిత మానవ చర్య కూడా దీనికి కారణమయ్యే అవకాశముంది. కాబట్టి, ఉద్రిక్తతలు పెరుగుతున్న చోట్లలో, జాగ్రత్తగా గమనించాల్సిందిగా కుశాల్​ కుమార్​ హెచ్చరించాడు.

 

Latest News