విధాత: అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో జరిగిన పేలుళ్లపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడుల్లో అమెరికా సైనికుల మృతిపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. తమ సైనికుల ప్రాణాలు తీసిన వారిని వదిలిపెట్టబోమని..ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. మృతిచెందిన అమెరికా సైనికులను హీరోలుగా ఆయన అభివర్ణించారు. దాడికి పాల్పడింది తామేనని ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ ప్రకటించిన నేపథ్యంలో ఆ ఉగ్రవాద సంస్థ నాయకులను హతమార్చాలని తమ దేశ ఆర్మీని బైడెన్ ఆదేశించారు. ఈనెల 31 కల్లా అఫ్గాన్ నుంచి తమ సైనిక బలగాలను ఉపసంహరించుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు. గురువారం కాబుల్ విమానాశ్రయం వద్ద జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 72 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో అమెరికాకు చెందిన 11 మంది సైనికులు, ఓ నేవీ వైద్యుడు ఉన్నారు. ఆ దేశానికి చెందిన మరో 12 మంది సైనికులు గాయపడ్డారు.
మా సైనికుల ప్రాణాలు తీసిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటాం
<p>విధాత: అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో జరిగిన పేలుళ్లపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడుల్లో అమెరికా సైనికుల మృతిపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. తమ సైనికుల ప్రాణాలు తీసిన వారిని వదిలిపెట్టబోమని..ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. మృతిచెందిన అమెరికా సైనికులను హీరోలుగా ఆయన అభివర్ణించారు. దాడికి పాల్పడింది తామేనని ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ ప్రకటించిన నేపథ్యంలో ఆ ఉగ్రవాద సంస్థ నాయకులను హతమార్చాలని తమ దేశ ఆర్మీని బైడెన్ ఆదేశించారు. ఈనెల 31 కల్లా అఫ్గాన్ […]</p>
Latest News

ఒకప్పుడు పేపర్ లీకేజీలపై పోరాటం.. నేడు అదే విషయంలో రాజీనామాకు ససేమిరా
తెలంగాణలో పవర్ కట్ అనేదే లేదు: భట్టి విక్రమార్క
24న విద్యాసంస్ధల బంద్ కు విద్యార్థి సంఘాల పిలుపు
విద్యార్థులపై కేసులు పెట్టొద్దు..దీక్ష విరమిస్తా : వాంగ్ చుక్
విద్యార్ధులపై పోలీసుల దమనకాండ: రాహుల్ గాంధీ
తెలంగాణలో మరిన్ని వర్షాలు.. !
హీరో బాలకృష్ణ హెల్త్ బులెటిన్ విడుదల
గిగ్ వర్కర్ల సమ్మె..ట్రాఫిక్ జామ్
తెలంగాణ నుంచి అదనంగా బియ్యం కొనుగోలుకు కేంద్రం అంగీకారం !
ధర్మేంద్ర రాజీనామాకు దేశ వ్యాప్తంగా జోరుగా ఆందోళనలు