SA vf AFG| ఫ‌స్ట్ సెమీ ఫైన‌ల్‌.. 56 ప‌రుగుల‌కే చాప చుట్టేసిన ఆఫ్ఘ‌నిస్తాన్

SA vf AFG| ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. మొత్తం 20 జట్లతో మొదలైన టోర్నీ ఇప్పుడు 4 జట్ల పోరుగా మారింది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు నాకౌట్ దశలో త‌మ అదృష్టం తేల్చుకునేందుకు సిద్ధ‌మ‌య్యాయి. ఆస్ట్రేలియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, కెనడా, ఐర్లాండ్, నమీ

  • Publish Date - June 27, 2024 / 07:21 AM IST

SA vf AFG| ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. మొత్తం 20 జట్లతో మొదలైన టోర్నీ ఇప్పుడు 4 జట్ల పోరుగా మారింది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు నాకౌట్ దశలో త‌మ అదృష్టం తేల్చుకునేందుకు సిద్ధ‌మ‌య్యాయి. ఆస్ట్రేలియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, కెనడా, ఐర్లాండ్, నమీబియా, నేపాల్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఒమన్, పాపువా న్యూ గినియా, స్కాట్లాండ్, శ్రీలంక, ఉగాండా, అమెరికా, వెస్టిండీస్ జట్లు ట్రోఫీ కోసం ఫైట్ చేసిన అవి టోర్నీ నుండి నిష్క్ర‌మించాయి. అయితే ఎవ‌రు ఊహించ‌ని విధంగా ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టు సెమీస్‌కి వెళ్లింది. వెస్టిండీస్‌కు చెందిన కరేబియన్ ఐలాండ్స్ స్టేడియం సెమీస్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుండ‌గా, తొలి సెమీఫైనల్ ట్రినిడాడ్-టొబాగోలో జ‌రుగుతుంది.

టాస్ గెలిచిన ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారీ అంచ‌నాల‌తో బ‌రిలోకి దిగిన ఆ జ‌ట్టు ఎక్క‌డ కూడా స‌రైన ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చ‌లేక‌పోయింది. జాన్సెన్ మూడు ఓవ‌ర్లు వేసి 16 ప‌రుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసాడు. ష‌మ్సీ 1.5 ఓవ‌ర్లు చేసి ఆరు ప‌రుగులు ఇచ్చి మూడు వికెట్స్ తీసాడు. ఇక ర‌బాడ‌, నోకియా కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ క్ర‌మంలో ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టు 11.5 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 56 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

ఆఫ్ఘనిస్తాన్ బ్యాట‌ర్స్ లో ముగ్గురు బ్యాట్స్‌మెన్ డ‌కౌట్ అయ్యారు. గుర్భాజ్ (0), ఇబ్ర‌హీం(2), గుల్భ‌ద్దీన్‌(9), ఒమ‌ర్జాయ్‌(10), న‌బీ(0), కరోటే(2), జ‌న‌త్ (8), ర‌షీద్ ఖాన్ (8), నూర్(0), నవీన్ (2), ఫరూఖీ(2) ప‌రుగులు చేశారు. అయితే ఈ ఇన్నింగ్స్‌లో 13 ప‌రుగులు ఎక్స్‌ట్రాల రూపంలో రావ‌డం విశేషం. టీ 20 వ‌ర‌ల్డ్ కప్ చ‌రిత్రలో చూస్తే నాకౌట్ మ్యాచ్‌లో అతి త‌క్కువ స్కోరు ఇదే. గ‌తంలో వెస్టిండీస్, శ్రీలంక మధ్య జ‌రిగిన మ్యాచ్ లో 101 ప‌రుగులు మాత్ర‌మే న‌మోదు కాగా, తాజా మ్యాచ్‌లో 56 ప‌రుగులు మాత్ర‌మే న‌మోదు కావ‌డం గ‌మ‌న‌ర్హం.

Latest News