Site icon vidhaatha

జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్ గా మార్చేశారు

విధాత‌: చంద్రబాబు నివాసం దగ్గర వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు.ఖబడ్దార్ జగన్మోహన్ రెడ్డీ-ఇంతకింతా బదులు తీర్చుకుంటాం,జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేశారు. ప్రజాస్వామ్యం మంటగలిసింది.చంద్రబాబు ఇంటి ముట్టడికి వైసీపీ గూండాలు ప్రయత్నించడం దారుణమైచర్య. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవనడానికి ఈ ఘటనే నిదర్శనం,ఫ్యాక్షన్ రాజకీయాలకు అలవాటుపడిన జగన్ రెడ్డి ఏపీని ఆఫ్ఘనిస్థాన్ గా మార్చేశారు,వైసీపీ నేతలు తాలిబన్లను మించిపోయారు.

వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై ప్రతిపక్షంగా మాట్లాడటం తప్పా, ప్రజా సమస్యలపై నిలదీస్తే గూండాగిరి చేస్తారా?జోగి రమేష్ ఎమ్మెల్యేనా లేక గూండానా..? మాజీ ముఖ్యమంత్రి, జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు ఇంటిపై రౌడీ మూకను వేసుకొచ్చి రాళ్ల దాడి చేయడమేంటి. దాడిని అడ్డుకున్న టీడీపీ నేతలపై రాళ్ల దాడి చేయడం అరాచక పాలనలోనే చూస్తున్నాం.

రెండున్నరేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అధికారాన్ని, పోలీసులను గుప్పిట్లో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దాడులకు ప్రోత్సహిస్తున్నారు.వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలి. లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతాం.

Exit mobile version