Site icon vidhaatha

Dolphins | శృంగార కోరిక‌లు ఎక్కువై.. మ‌న‌షులపై డాల్ఫిన్ దాడులు

Dolphins | అది జ‌పాన్‌( Japan )లోని వ‌కాసా బే( Wakasa Bay ) బీచ్.. ఇది జ‌పాన్ రాజ‌ధాని టోక్యో( Tokyo )కు 300 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. అయితే ఆ బీచ్ వ‌ద్ద భారీ భ‌ద్ర‌త పెంచారు. బీచ్‌లోకి ఎవ‌ర్నీ వెళ్ల‌నివ్వ‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఈ జాగ్ర‌త్త‌లు ఎందుకు తీసుకుంటున్నారంటే.. ఆ బీచ్‌లో ఉండే ఓ డాల్ఫిన్( Dolphin ) మ‌నషుల‌పై దాడుల‌కు పాల్ప‌డ‌ట‌మే. మ‌రి అది ఎందుకు దాడులు చేస్తుందంటే.. దానిలో శృంగార కోరిక‌లు ఎక్కువై.

బాటిల్ నోస్ డాల్ఫిన్‌లు( Bottlenose dolphins ) అత్యంత శ‌క్తివంత‌మైన‌వి. భౌతిక దాడుల‌కు కూడా వెనుకాడ‌వు. మ‌న‌షుల్లో హార్మోన్ల( Hormones ) హెచ్చుత‌గ్గులు ఉన్న‌ట్లే ఈ బాటిల్ నోస్ డాల్ఫిన్ల‌లో కూడా ఉంటాయ‌ట‌. దీంతో ఒక్కోసారి లైంగిక కోరిక‌లు పెరిగిపోవ‌డం, త‌న‌కు కావాల్సిన పార్ట్‌న‌ర్ కోసం వెత‌క‌డం వంటివి చేస్తాయ‌ట‌. ఈ సంద‌ర్భాల్లో క‌నిపించిన మ‌నిషిపై క‌నిపించిన‌ట్టు దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రుస్తాయ‌ని షార్క్ బే డాల్ఫిన్ రీసెర్చ్ ప్రాజెక్టు బ‌యాల‌జిస్ట్ డాక్ట‌ర్ సిమాన్ అల్లెన్ తెలిపారు.

బాటిల్ నోస్ డాల్ఫిన్‌లు ఇప్ప‌టి వ‌ర‌కు 47 మందిని గాయ‌ప‌రిచాయి. 2022లో ఒకర్ని, గ‌తేడాది ఆరుగురిని, 2024లో 18 మందిని తీవ్రంగా గాయ‌ప‌రిచాయి. అయితే ఓ స్కూల్ చిల్డ్ర‌న్‌పై దాడి చేయ‌డంతో.. చేతికి 25 కుట్లు ప‌డ్డాయి. ఈ దాడుల‌న్నింటి వెనుకాల ఒకే డాల్ఫిన్ ఉండొచ్చ‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

Exit mobile version