Site icon vidhaatha

República Dominicana | కుప్పకూలిన నైట్ క్లబ్ పైకప్పు.. 66 మంది మృతి

República Dominicana |

విధాత: డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగోలోని ఒక నైట్ క్లబ్ పైకప్పు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 66 మందికి పైగా మృతి చెందగా.. దాదాపు 160 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈవెంట్‌కి కీలక రాజకీయ నేతలు, అథ్లెట్లు వచ్చినట్లు సమాచారం. ఈ హృదయ విదారక ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. సాంటో డొమింగో నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్న జెట్ సెట్ నైట్ క్లబ్‌లో బుధవారం రాత్రి ఈ ఘోర ప్రమాదం జరిగింది.

అక్కడ జరుగుతున్న సంగీత కచేరీకి పెద్ద సంఖ్యలో యువకులు, ప్రముఖులు హాజరయ్యారు. ఆనందోత్సాహాలతో నిండిన వాతావరణం ఒక్క క్షణంలో భీతావహంగా మారిపోయింది. పెద్ద శబ్దంతో పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ ఉన్నవారంతా శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య అధికారికంగా 66కు చేరుకుందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంపై డొమినికన్ రిపబ్లిక్ ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అధ్యక్షుడు ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.

Exit mobile version