క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం

విధాత: రాష్ట్రపతి భవన్‌లో క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం శనివారం జరిగింది. భారత అత్యున్నత క్రీడా పురస్కా రం మేజర్ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న-2021 అవార్డులు, అర్జున, లైఫ్‌ ఎచీవ్‌మెంట్ పురస్కారాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అందించారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. నీరజ్‌ చోప్రా, రవికుమార్‌, లవ్లీనా, శ్రీజేష్, అవని, సుమిత్, ప్రమోద్‌, కృష్ణ నగార్‌, మనీశ్‌, మిథాలీరాజ్‌, సునీల్ ఛెత్రి, మన్‌ప్రీత్‌ సింగ్‌ మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న పురస్కారాలను స్వీకరించారు. గతంలో లేని విధంగా ఈసారి పన్నెండు మందికి ఖేల్‌రత్న పురస్కారాలను ప్రకటించడం విశేషం. టోక్యో ఒలింపిక్స్‌లో […]

  • Publish Date - November 13, 2021 / 06:10 PM IST

విధాత: రాష్ట్రపతి భవన్‌లో క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం శనివారం జరిగింది. భారత అత్యున్నత క్రీడా పురస్కా రం మేజర్ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న-2021 అవార్డులు, అర్జున, లైఫ్‌ ఎచీవ్‌మెంట్ పురస్కారాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అందించారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. నీరజ్‌ చోప్రా, రవికుమార్‌, లవ్లీనా, శ్రీజేష్, అవని, సుమిత్, ప్రమోద్‌, కృష్ణ నగార్‌, మనీశ్‌, మిథాలీరాజ్‌, సునీల్ ఛెత్రి, మన్‌ప్రీత్‌ సింగ్‌ మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న పురస్కారాలను స్వీకరించారు.

గతంలో లేని విధంగా ఈసారి పన్నెండు మందికి ఖేల్‌రత్న పురస్కారాలను ప్రకటించడం విశేషం. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంతో భారత జెండాను రెపరెపలాడించిన నీరజ్ చోప్రా, హాకీలో జట్టుకు కాంస్య పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించిన మన్‌ప్రీత్‌ సింగ్‌, శ్రీజేష్‌, మహిళల క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణి మిథాలీరాజ్‌ సహా పలు వురికి ఖేల్‌రత్న పురస్కారం వరించింది.

సుబ్రమణియన్‌ రామన్ (టేబుల్‌ టెన్నిస్), జై ప్రకాశ్‌ నౌతియాల్‌ (పారా షూటింగ్), టీపీ ఔసెఫ్‌ (అథ్లెటిక్స్), సర్కార్‌ తల్వార్‌ (క్రికెట్), అషాన్‌ కుమార్‌ (కబడ్డీ), తపన్‌ కుమార్‌ పాణిగ్రాహి (స్విమ్మింగ్‌), రాధాక్రిష్ణన్‌ నాయర్ (అథ్లెటిక్స్), సంధ్యా గురుంగ్‌ (బాక్సింగ్), ప్రీతమ్‌ సివాచ్‌కి (హాకీ) ద్రోణాచార్య అవార్డు లభించింది.

లేఖ కేసీ (బాక్సింగ్), అభిజీత్‌ కుంతే (చెస్), దవీందర్‌ సింగ్‌ గర్చా (హాకీ), సజ్జన్‌ సింగ్‌ (రెజ్లింగ్‌), వికాస్‌ కుమార్‌ (కబడ్డీ)కు ధ్యాన్‌చంద్‌ లైఫ్‌ అచీవ్‌మెంట్ పురస్కారాలు వచ్చాయి. ప్రియాంక మన్గేష్ మోహితే (ల్యాండ్‌), లెఫ్టినెంట్ కల్నల్‌ జై ప్రకాశ్‌ కుమార్‌ (ల్యాండ్‌), కల్నల్ అమిత్ బిస్త్‌ (ల్యాండ్‌), షీతల్‌ రాజ్ (ల్యాండ్‌), శ్రీకాంత్‌ విశ్వనాథన్‌ (వాటర్‌‌), లెఫ్టినెంట్ కల్నల్‌ సర్వేష్ దడ్వాల్ (ఎయిర్‌), జై కిషన్‌కు (లైవ్‌ ఎచీవ్‌మెంట్)కు ట్రెంచింగ్‌ నార్గే జాతీయ అడ్వెంచర్ అవార్డులు వరించాయి. మౌలానా అబ్దుల్‌ కలాం అజాద్‌ ట్రోఫీని పంజాబ్‌ యూనివర్సిటీ, రాష్ట్రీయ ఖేల్‌ ప్రోత్సాహన్‌ పురస్కారాలను మానవ్‌ రచ్నా ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూషన్‌, ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్‌ సొంతం చేసుకుంది.

Latest News