Site icon vidhaatha

American VISA | అమెరికా వీసా జారీకి ముందు సోషల్‌ మీడియా అక్కౌంట్ల తనిఖీ!

American VISA | పాల‌స్తీనాపై దాడుల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తున్న విద్యార్థులు, ప‌రిశోధ‌కుల‌ను వారి వారి దేశాల‌కు పంపుతున్న అమెరికా ప్ర‌భుత్వం తాజాగా సామాజిక మాధ్య‌మాల‌ను కూడా త‌నిఖీ చేసిన త‌ర్వాతే కొత్త వీసాలు జారీ చేయాల‌ని దౌత్య కార్యాల‌యాల‌కు ఆదేశాలు పంపిన‌ట్టు స‌మాచారం. యూదు వ్య‌తిరేక ఆందోళ‌న కారుల‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న అమెరికా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఆదేశాలు జారీ చేస్తున్న‌ది. అమెరికా పౌరుల‌ప‌ట్ల‌, అమెరికా సంస్కృతి, ప్ర‌భుత్వం, సంస్థ‌లు, మౌలిక సూత్రాల‌ప‌ట్ల వ్య‌తిరేక‌త ఉన్న‌ట్టు నిర్ధార‌ణ అయితే వీసాలు నిరాక‌రించ‌వ‌చ్చ‌ని ప్ర‌భుత్వం పంపిన ఆదేశాలు పేర్కొంటున్నాయి.

ఇక ముందు అమెరికా ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌పై ఎవ‌ర‌యినా నిర‌స‌న‌, విమ‌ర్శ, వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తే వీసా నిరాక‌ర‌ణ‌కు గుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని దౌత్య‌నిపుణులు చెబుతున్నారు. ఎఫ్‌, ఎం, జె ర‌కం వీసా ద‌ర‌ఖాస్తుదారుల సామాజిక మాధ్య‌మ ఖాతాల‌ను ప్ర‌త్యేకంగా త‌నిఖీ చేయాల‌ని ప్ర‌భుత్వ ఆదేశాలు పేర్కొన్నాయి. ఈ ఆదేశాల‌ను హాండ్ బాస్కెట్ అనే ఒక స్వ‌తంత్ర వార్తా వెబ్‌సైట్ పేర్కొంది. అయితే ఈ ఆదేశాలు ప‌ర్యాట‌క వీసాల‌కు వ‌ర్తించేదీ లేనిదీ ఆ ఆదేశాల‌లో పేర్కొన‌లేదు.

Exit mobile version