Site icon vidhaatha

ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడి

రెండు వారాల్లో అన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ రెండు రోజుల్లో ముగించాడు. ఇరాన్​కు తీవ్ర హెచ్చరిక జారీ చేసిన ట్రంప్​ ఆశ్చర్యకరంగా ఇరాన్​పై దాడి చేసాడు. ఇరాన్​ ముఖ్యమైన  మూడు అణుకేంద్రాలైన ఫోర్డో, నటాంజ్​, ఎస్ఫహాన్ (Fordow, Natanz, and Esfahan)అణుకేంద్రాలను పూర్తిస్థాయిలో నాశనం చేసినట్లు ఆయన ఎక్స్​ వేదికగా ప్రకటించారు. సరిగ్గా శుక్రవారం రాత్రి 10 నుండి 10.30 (CST) మధ్య ఎనిమిది ఇంధన ట్యాంకర్​ విమానాలు ఓక్లహామా ఎయిర్​బేస్​ నుండి బయలుదేరి బి–2 బాంబర్ల (B-2) స్థావరమైన మిస్సోరీకి చేరుకున్నాయి. అక్కన్నుంచి నిశ్శబ్దంగా ఆరు బి–2 బాంబర్లు, ఇంధన విమానాలు బయలుదేరి ఇరాన్​ వైపుగా దాదాపు 37 గంటలు ప్రయాణించి ఫోర్డో, నటాంజ్​, ఇస్ఫహాన్​ అణుకేంద్రాలపై దాడులు నిర్వహించాయి.  వీటికి దన్నుగా అమెరికా సూపర్​ ఫైటర్​ జెట్లు ఎఫ్​–22(F-22)లు, ఐదోతరం ఫైటర్​ ఎఫ్​‌‌35ఏ(F35A)లు అనుసరించినట్లు వాషింగ్టన్​ పోస్ట్​ వివరించింది. ముఖ్యంగా అతి ప్రమాదకరంగా భావిస్తున్న ఫోర్డో అణుఇంధన శుద్ధి కేంద్రం(Fordo Nuclear enrichment Centre) పై ఏకంగా ఆరు జిబియు–57 (GBU-57)బంకర్​ బస్టర్​ బాంబులను ప్రయోగించినట్లు తెలిసింది. దీంతో రెండు బాంబులతో పనైపోతుందని అంచనా వేసిన రక్షణరంగ నిపుణులకు ఆశ్చర్యపరుస్తూ ఆరు బాంబులు వేయడంతో ఫోర్డో నామరూపాల్లేకుండా సర్వనాశనమైపోయిందని అమెరికా ప్రకటించింది. దీంతోపాటు, తీరానికి 400మైళ్ల దూరంలో మోహరించిఉన్న అమెరికన్​ జలాంతర్గాములు (Sub-marines)దాదాపు 30 తోమహాక్(Tomahawk)​  క్రూయిజ్​ క్షిపణులకు కూడా ప్రయోగించినట్లు తెలిసింది.

వీటి ప్రయోగంతో అమెరికా అధికారికంగా యుద్ధంలోకి దిగినట్లైంది. దాడుల తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ (Donald Trump)జాతినుద్దేశించి మాట్లాడుతూ, అమెరికా సైన్యం అత్యద్భుతంగా పనిచేసిందని కొనియాడారు. ప్రపంచంలోని ఏకైక భారీ సైనిక శక్తి తన సత్తా ఏంటో చాటిందన్న ట్రంప్​, వారికి అభినందనలు తెలియజేసారు. ఇక ఇరాన్(Iran)​కు మిగిలింది శాంతి, దు:ఖం అనే రెండు అవకాశాలే. ఎటువంటి ప్రతిఘటనాచర్యలు చేపట్టినా, ఇరాన్​కు రెండోదో మిగులుతుందని హెచ్చరించారు.

Exit mobile version