CSK vs GT| ఈ సారి ప్లే ఆఫ్స్‌కి ఏ జట్టు వెళుతుందో చివరి వరకు చెప్పడం చాలా కష్టంగానే ఉంది. డూ ఆర్ డై మ్యాచ్‌లో బెబ్బులిలా విజృంభించి మంచి విజయాలు సాధిస్తున్నారు. ఆర్సీబీ వరుస విజయాలతో ప్లే ఆఫ్స్‌కి దగ్గరవుతుంటే ఇప్పుడు జీటీ కూడా తాజాగా జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై విజయం సాధించి ప్లే ఆఫ్ మరింత రసవత్తరంగా మార్చింది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 231 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (104; 55 బంతుల్లో, 9×4, 6×6), సాయి సుదర్శన్ (103; 51 బంతుల్లో, 5×4, 7×6) శతకాలు చేయగా, సీఎస్కే బౌలర్స్‌కి చుక్కలు చూపించారు. ఈ ఇద్దరు కూడా తొలి వికెట్‌కి 210 పరుగులు చేయడం విశేషం. చెన్నై బౌలర్స్‌లో తుషార్ (2/33)కి మాత్రమే రెండు వికెట్లు దక్కాయి. మిగతా ఎవరు కూడా వికెట్స్ దక్కించుకోలేకపోయారు
ఇక భారీ లక్ష్య చేధనతో బరిలోకి దగిన సీఎస్కేకి శుభారంభం లభించలేదు. రచిన్ రవీంద్ర (1; 2 బంతుల్లో), ఇంపాక్ట్ ప్లేయర్ అజింక్య రహానె (1; 5 బంతుల్లో), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (డకౌట్; 3 బంతుల్లో) వెంటవెంటనే ఔట్ కావడంతో 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాలలో పడింది చెన్నై. ఆ సమయంలో డారిల్ మిచెల్ (63; 34 బంతుల్లో, 7×4, 3×6), మొయిన్ అలీ (56; 36 బంతుల్లో, 4×4, 4×6) మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా ఆడుతూ పరుగులు రాబట్టారు. నాలుగో వికెట్‌కి ఈ జోడి 57 బంతుల్లో 109 పరుగులు చేశారు. అయితే వారిద్దరు ఔటైన తర్వాత చెన్నై స్కోరు వేగం తగ్గింది. చివరలో ధోని కాస్త మెరుపులు మెరిపించిన కూడా టార్గెట్‌ని చేధంచలేకపోయింది. చివరికి చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 196 పరుగులు మాత్రమే చేయగలిగింది.
గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మోహిత్ శర్మ (3/31) మూడు, రషీద్ ఖాన్ (2/38) రెండు వికెట్లు తీసుకొని చెన్నైని కట్టడి చేశారు..ఈ గెలుపుతో ప్లేఆఫ్స్ అశలను గుజరాత్ సజీవంగా ఉంచుకోగా, చెన్నై సంక్లిష్టం చేసుకుంది అని చెప్పాలి ..సీఎస్కే టాప్-4లోనే కొనసాగుతున్నప్పటికీ తదుపరి దశకు చేరుకోవడానికి ఈ ఓటమి కాస్త ఇబ్బందిగా మారిందనే చెప్పాలి.