BCCI new president| బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ మిథున్ మన్హాస్ నియామితులయ్యారు. ముంబయిలో జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో 37వ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.

విధాత : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా(BCCI new president) మాజీ కెప్టెన్ మిథున్ మన్హాస్(Mithun Manhas) ఎంపికయ్యారు.  రోజర్‌ బిన్నీ పదవి కాలం ముగియ్యడంతో ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిగా మన్హాస్ ఎంపికయ్యారు. ముంబయిలో జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో 37వ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. నూతన అధ్యక్షుడిగా నియామితులైన 45 ఏళ్ల మన్హాస్‌ ఢిల్లీ తరఫున 157 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు, 130 లిస్ట్‌-ఎ మ్యాచ్‌లు ఆడాడు. అతడు 55 ఐపీఎల్‌ మ్యాచ్‌లు కూడా ఆడారు. కాని భారత్ తరుఫునా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. మన్హాస్‌ జమ్ముకశ్మీర్‌ క్రికెట్‌ సంఘంలో పాలకుడిగా పనిచేశాడు.

ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా

బీసీసీఐ అధ్యక్ష, ఉపాధ్యక్షుడి పదవులతోపాటు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ట్రెజరర్ స్థానాలకు ఒకే ప్యానెల్‌ నామినేషన్‌ దాఖలు చేసింది. మిథున్‌ మన్హాస్ అధ్యక్షుడిగా ఎన్నికవ్వగా..ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా దేవజిత్‌ సైకియా మరోసారి ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా ప్రభ్‌తేజ్‌ సింగ్‌ భాటియా, కోశాధికారిగా రఘురామ్‌ భట్‌ ఎన్నికైనట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అపెక్స్‌ కౌన్సిల్‌లో ఇప్పటి వరకు జయ్‌దేవ్‌ నిరంజన్‌ ఏక సభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు మరో ఇద్దరిని బీసీసీఐ ఏజీఎం ఎంపిక చేసింది. ఐపీఎల్‌ ఛైర్మన్‌గా ఉన్న అరుణ్‌ ధుమాల్‌తోపాటు కైరుల్ జమాల్ మజుందార్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌లోకి తీసుకున్నారు.