విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదివారం కేరళ పర్యటన(visits Kerala)కు వెళ్లారు. అసెంబ్లీ సమావేశాల రెండో రోజు ఉదయం ఆయన పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులపై చర్చ(Assembly debate)ను ప్రారంభించి మాట్లాడారు. అనంతరం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కేరళకు బయలు దేరారు.
అక్కడి నుంచి హెలికాప్టర్ లో అలిప్పి చేరుకుని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి హెలికాప్టర్ లో కొచ్చికి చేరుకుని ప్రత్యేక విమానంలో సాయంత్రం తిరిగి బేగంపేటకు చేరుకుంటారు. సాయంత్రం 4గంటలకు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చలో పాల్గొంటారు.