Site icon vidhaatha

Earthquake| ఉత్తర భారతంలో భూకంపం..4.4గా నమోదు

విధాత : ఉత్తర భారత దేశ రాష్ట్రాలను గురువారం ఉదయం సంభవించిన భూకంపం వణికించింది. దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేద్ సహా పలు రాష్ట్రాలలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 9.04గంటలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. ఈ భూకంప కేంద్రం హర్యానాలోని ఝజ్జర్కు ఈశాన్యన 3కిలోమీటర్ల దూరంలో 10కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లుగా జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది.

తాజా భూకంపంతో ఎక్కడా ఎలాంటి ఆస్తి..ప్రాణనష్టం వాటిల్లలేదని..ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఎన్డీఆర్ఎఫ్ తెలిపింది.

Exit mobile version