న్యూఢిల్లీ : దీపావళి పర్వదినం వేళ విషాద ఘటన(Diwali Accident)చోటుచేసుకుంది. దీపావళి సందర్భంగా బాణ సంచా కొనుగోలు(Firecracker Storage) చేసి నిల్వ చేసిన ఓ ఇంట్లో పేలుడు(Firecracker Blast) సంభవించడంతో నలుగురు ప్రాణాలు(Four Dead) కోల్పోయారు. తమిళనాడులోని చైన్నై సమీపంలో తిరువళ్లూరు(Tiruvallur) జిల్లా పట్టాభిరామ్‌లోని ఓ ఇంట్లో జరిగిన పేలుడు జరిగి నలుగురు మృతి చెందారు. పేలుడు దాటికి ఇల్లు పూర్తిగా దెబ్బతింది. బాణసంచాను ఇక్కడ అక్రమంగా నిల్వ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో రాయవరం గ్రామంలోని లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ లో జరిగిన ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. ఎనిమిది మంది గాయపడ్డారు. బాణాసంచా కేంద్రాల్లో దీపావళి సందర్బంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలు నివారించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.