విధాత, హైదరాబాద్ : తెలంగాణ జాగృతి( Telangana Jagruti) అధ్యక్షురాలు, బీఆర్ఎస్ బహిష్కృత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( Kavitha)ను పోలీసులు అరెస్టు(Arrest) చేశారు. ఆమెను నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కవిత, సింగరేణి జాగృతి, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సింగరేణి కేంద్ర కార్యాలయం ముట్టడించారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అనుమతి లేకుండా నిరసనకు దిగడం..కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు కవితను అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసులతో కాసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ
సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని, మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఇటీవల జాగృతి జనం బాట పేరుతో కవిత జిల్లాల పర్యటన చేపట్టారు. జనం బాటతో పాటు పలు సందర్భాల్లో కవిత సింగరేణి సంస్థ, కార్మికుల సమస్యలపై మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సింగరేణి భవన్ ముట్టడికి ప్రయ్నతించి అరెస్టయ్యారు.
