న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు చెందిన అమెరికా పారిశ్రామికవేత్త, ఇంజెనెస్ ఫార్మాస్యూటికల్స్ అధినేత, బిలియనీర్ మంతెన రామలింగరాజు (Mantena Ramalingaraju)కుమార్తె నేత్ర-వంశీ గాదిరాజు(ఎన్‌ఆర్‌ఐ)ల పెళ్లి వేడుక(wedding ceremony) రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోలో వైభవంగా జరిగింది. వందల కోట్ల ఖర్చుతో జరిగిన ఈ పెళ్లి వేడుకకు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ సెలబ్రిటీలు హాజరై.. నూతన దంపతులను ఆశీర్వదించారు. పెళ్లి వేడుకకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ డొనాల్డ్ ట్రంప్(Trump Jr), గాయని-నటి జెన్నిఫర్ లోపెజ్(Jennifer Lopez), జస్టిన్ బీబర్, రాంచరణ్, హృతిక్ రోషన్ సహా బాలీవుడ్ నటులు తదితరులు హాజరై సందడి చేశారు. దీంతో ఈ పెళ్లి వేడుక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముఖ్యంగా వివాహా వేడుకలలో భాగంగా సంగీత్ లో జెన్నిఫర్ లోపెజ్, బీబర్, కృతి సనన్, జాన్వీకపూర్, రణబీర్ సింగ్, మాధురి, షాహిద్‌లు తమ ఆటపాటల ప్రదర్శనలతో అలరించారు. గ్లోబల్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ భారతదేశంలో చేసిన తొలి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇదే కావడం విశేషం. మల్టిపుల్ డ్రెస్స్‌లతో లోపెజ్ చేసిన డాన్స్ అందరి ఆకర్షించింది. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపే సమయంలో జెన్నిఫర్ పింక్ సారిలో వచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది.
Jennifer Lopez performing “Get Right” at a billionaire’s wedding in India. pic.twitter.com/13dMmMifWp
— Jennifer Lopez Updates (@JLopezUpdate2) November 23, 2025
