విధాత, హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections)కు సంబంధించిన పిటిషన్ల విచారణను తెలంగాణ హైకోర్టు(Telangana High Court) వాయిదా వేసింది. సోమవారం జరుగాల్సిన విచారణ హైకోర్టు చీఫ్ జస్టీస్ సెలవులో ఉన్న కారణంగా రేపటికి వాయిదా పడింది. పిటిషన్లపై రేపు విచారణ కొనసాగనుంది.
స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వం(Telangana Government), ఎన్నికల సంఘం(Ec) ఎన్నికలకు సిద్దంగా ఉన్నామని హైకోర్టుకు వివరించాయి.హైకోర్టు నిర్ణయం వెలువడిన పిదప మంగళవారం జరుగాల్సిన తెలంగాణ కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. హైకోర్టు విచారణ రేపటికి వాయదా పడటంతో కోర్టు నిర్ణయం వెలువడిన పిదపనే కేబినెట్ భేటీ కానున్నట్లుగా సమాచారం. స్థానిక ఎన్నికలకు సంబంధించి గత విచారణ సందర్భంగా హైకోర్టు సూచించిన మేరకు పాత రిజర్వేషన్ల మేరకు ప్రభుత్వం ఎన్నికలకు సిద్దమైంది. సర్పంచ్ లు, వార్డు సభ్యుల రిజర్వేషన్లను సైతం వెలువరించింది. రిజర్వేషన్లను గెజిట్ చేసి ఎన్నికల సంఘానికి పంపించేందుకు కావాల్సిన కసరత్తు పూర్తి చేసింది.
