Site icon vidhaatha

Kaleshwaram Project| వరదల చర్చ మాని బురద రాజకీయానికే కాళేశ్వరం రచ్చ!

విధాత, హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం బురద రాజకీయాలు చేసేందుకు ఆదరాబాదరగా అసెంబ్లీ (Assembly)లో ఆదివారం కాళేశ్వరం నివేదిక(Kaleshwaram  Commission)పై కుట్ర పూరితంగా చర్చ పెట్టి రచ్చ చేస్తుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao)విమర్శించారు. అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై మంత్రి ఉత్తమ్ చర్చను ప్రారంభించిన అనంతరం బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు చర్చను కొనసాగించారు. తన ప్రసంగం మొదలులోనే అధికార పార్టీ సభ్యులు అడ్డుతగలడంపై హరీష్ రావు మండిపడ్డారు. మేం కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చకు భయపడి కోర్టుకు వెళ్లలేదని..మా రాజ్యాంగ హక్కుల మేరకు 8బీ, సీ మేరకు కేసీఆర్ కు, నాకు నోటీసులు ఇవ్వకుండా జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ నివేదిక ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ మేం కోర్టుకు వెళ్లామని స్పష్టం చేశారు. ఘోష్ కమిషన్ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందని ఆక్షేపించారు. కాళేశ్వరంపై ఎన్ని రోజులైనా చర్చకు మేం సిద్దంగా ఉన్నామని..ప్రభుత్వం మాత్రం 650పేజీల నివేదికపై అరగంటలో చర్చ పూర్తి చేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు.

స్పందించిన మంత్రి డి.శ్రీధర్ బాబు(SRIDHER BABU)మాట్లాడుతు హరీష్ రావు కాళేశ్వరంపై చర్చను కొనసాగించాలని..ఇతర అంశాలను ప్రస్తావించడం సరికాదన్నారు. మేం రాజకీయ కుట్ర చేయదలుచుకుంటే ప్రభుత్వం వచ్చిన రెండో రోజునే చేసే వారమన్నారు. బదులుగా హరీష్ రావు మాట్లాడుతూ తాము కమిషన్ నివేదికను రాజకీయ ఆయుధంగా వాడుకోరాదని సుప్రీంకోర్టు గత తీర్పుల్లో స్పష్టం చేసిందని గుర్తు చేశారు. హరీష్ రావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా..అధికార పార్టీ సభ్యులు, మంత్రులు మధ్యమధ్యలో అడ్డుతగులుతున్నారు.

 

 

Exit mobile version