ప్రముఖ క్యారెక్టర్ నటుడు బ్రహ్మాజీ, ఆమని, ధన్య బాలకృష్ణన్ కీలక పాత్రల్లో నటించిన నూతన చిత్రం బాపు ( Baapu). ఓ తండ్రి ఆత్మహత్య కథగా రూపొందిన ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ వినోదాత్మకంగా రూపొందింది. ఫిబ్రవరి 21న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదల చేసి టీజర్, పాటలు మంచి క్రేజ్ తీసుకురాగా తా జాగా ఈ మూవీ నుంచి కంగారు పడకు అంటూ సాగే మరో పాటను రిలీజ్ చేశారు. RR దృవన్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటకు అల రాజు సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి ఆలపించారు.