Kantara Chapter 1| కాంతార థియేటర్ లోకి.. పంజుర్లి దేవుడి హంగామా..!

రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన 'కాంతార చాప్టర్ 1 చిత్రానికి థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడు దిండిగల్లోని ఓ థియేటర్లో ప్రేక్షకులు ఈ మూవీ చూస్తుండగా ఓ అభిమాని పంజుర్లి దేవుడి వేషధారణలో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

విధాత : రిషబ్ శెట్టి(Rishab Shetty) నటించి దర్శకత్వం వహించిన కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన ‘కాంతార చాప్టర్ 1(Kantara Chapter 1) చిత్రానికి థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే. చాలా చోట్ల సినిమా చూస్తుండగా కొందరికి పూనకాలు వచ్చిన వీడియోలూ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే తాజాగా తమిళనాడు దిండిగల్లోని ఓ థియేటర్లో(Theatre) ప్రేక్షకులు ఈ మూవీ చూస్తుండగా ఓ అభిమాని పంజుర్లి దేవుడి(Panjurli Deva)వేషధారణలో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పంజుర్లి దేవుడి వేషధారణలో థియేటర్ కు వచ్చిన అభిమాని సినిమాలో పంజుర్లి దేవుడిని అనుకరిస్తూ తన నటనలో అందరిని ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల అతడి విన్యాసాలను తమ సెల్ ఫోన్లతో బంధించేందుకు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

రిషబ్ శెట్టి..రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రల్లో నటించిన కాంతార చాప్టర్ 1 సినిమా బాక్సాఫీస్ వద్ధ హిట్ టాక్ తో వసూళ్లలో దూసుకపోతుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా కాంతార చాప్టర్ 2 కూడా మేకర్స్ ప్రకటించారు. కాంతార చాప్టర్ 1 మూవీ కథలోకి వెళితే  ‘కాంతార’ అడవిలోని గిరిజనులకు పెద్ద పులి కాపలలో ఉన్న పసిబిడ్డ(రిషబ్ శెట్టి) దొరుకుతాడు. దేవుడి బిడ్డగా అతన్ని భావించి, బెర్మే అనే పేరు పెట్టి గిరిజనులు అతన్ని పెంచుతారు. బెర్మే పెరిగి పెద్దవాడు అయ్యేపట్టికీ భాంగ్రా యువరాజు కులశేఖర్ (గుల్షన్ దేవయ్య) కన్ను కాంతారలోని దేవుని శిలపై పడుతుంది. తన తాత చేయలేని పనిని తాను చేయాలనుకుని విఫలుడవుతాడు. అతనికి బుద్ధి చెప్పి వెనక్కి పంపిన బెర్మే, తన సహచరులతో కలిసి భాంగ్రా ను చూడటానికి వెళతాడు. అక్కడ యువరాణి కనకావతి (రుక్మిణీ వసంత్)తో అతనికి పరిచయం అవుతుంది.

భాంగ్రాలో వెట్టి చాకిరి చేస్తున్న తన తోటి గిరిజనులకు విముక్తి కలిగించడం కోసం, భాంగ్రా ఓడరేవు ద్వారా సుగంధ ద్రవ్యాల వర్తకం చేయడం కోసం బెర్మే సిద్థమౌతాడు. ఆ సందర్భంలో అతనికి భాంగ్రా నుండి ఎలాంటి ఆపద ఎదురైంది? దైవీక శక్తితో దానిని అతను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది సినిమా కథగా సాగుతుంది.. ఫ‌స్టాఫ్‌ సాగదీతగా ఉన్నా..సెకండాఫ్ తో పాటు సినిమాటోగ్రఫీ, ‘బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను నిలబెట్టింది. జానపదం, భక్తి, మానవ భావోద్వేగాలను అద్భుతంగా మిళితం చేశారు. పూనకం ఎపిసోడ్ “కాంతరా” కి సిగ్నేచర్ సీన్. అలాగే ఊహించని ఒక ట్విస్ట్ క్లైమాక్స్ లో కనిపిస్తుంది.

Exit mobile version