విధాత: హైదరాబాద్ లో అషాడ మాసం బోనాల వేడుకలలో భాగంగా ఆదివారం లాల్‌దర్వాజా సింహవాహిని మహాంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా సాగింది. ఉదయం అమ్మవారికి కుమ్మరి బోనం సమర్పించిన అనంతరం భక్తలు భారీ సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజలలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సహా పలువురు ప్రముఖులు అమ్మవారి బోనాల వేడులకలలో పాల్గొని పూజలు నిర్వహించారు.
బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బోనాల సందర్భంగా భక్తుల రద్ధీని నియంత్రించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించారు. అటు పాతబస్తీలో కొలువైన భాగ్యలక్ష్మి అమ్మవారిని మంత్రులు పొన్నం, కోమటిరెడ్డిలు దర్శించుకుని పూజలు చేశారు. ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించారు.