Site icon vidhaatha

Muralidhar Rao| మురళీధర్ రావుకు 14 రోజుల రిమాండ్

విధాత, హైదరాబాద్ : అదాయానికి మించి అక్రమాస్తుల కేసులో అరెస్టయిన ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుకు ఏసీబీ కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. మురళీధర్ రావు ఆస్తులకు సంబంధించి నిన్న రోజంతా ఏసీబీ 12చోట్ల నిర్వహించిన తనిఖీల్లో 200కోట్ల మేరకు అక్రమాస్తులు గుర్తించారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్న స్థిర, చర అక్రమాస్తులను గుర్తించారు. మురళీధర్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు.

ఏసీబీ గుర్తించిన మురళీధర్ రావు అక్రమాస్తులలో కొండాపూర్‌లో విల్లా, బంజారాహిల్స్‌లో ఫ్లాట్, యూసుఫ్‌గూడలో ఫ్లాట్, బేగంపేటలో ఫ్లాట్, కోకాపేటలో ఫ్లాట్, కరీంనగర్‌లో వాణిజ్య భవనం, హైదరాబాద్‌లో వాణిజ్య భవనం, కోదాడ్ లో అపార్ట్‌మెంట్, జహీరాబాద్‌లో 2కేడబ్ల్యు సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్రాజెక్టు, రంగల్‌లో నిర్మాణంలో ఉన్నఅపార్ట్‌మెంట్, 11 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో 4 నివాస ప్రైమ్ ఓపెన్ ప్లాట్లు, మోకిలాలో 6500 చదరపు గజాల భూమి, మెర్సిడెస్ బెంజ్ కారు, బంగారు ఆభరణాలు, బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి.

మురళీధర్‌రావు ఉమ్మడి రాష్ట్రంలోనే పదవీ విరమణ పొందారు. తర్వాత ఆయన పదవీ కాలాన్ని 13 ఏళ్ల పాటు పొడిగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్లు ఆ పదవిలో ఉన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్‌ నివేదిక తర్వాత మురళీధర్‌రావును ప్రభుత్వం తొలగించింది.

Exit mobile version