Site icon vidhaatha

ACB | కాళేశ్వరం ENC హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు

విధాత: కాళేశ్వరం ఇంజనీర్ ఇన్ చీఫ్ హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ షేక్ పేట లోని హరిరామ్ నివాసంలో ఈ శనివారం తెల్లవారుజాము నుంచి ఏసీబీ సోదాలు చేపట్టారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండీగా హరిరామ్ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతుల, రుణాల అంశంలో కీలకంగా హరిరామ్ వ్యవహరించినట్లు చెబుతున్నారు.

తాజాగా నేషనల్ డ్యామ్ చీఫ్ అథారిటీ బీసీ ఘోస్ట్ కమిషన్కు నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ సోదాలు జరగడం చర్చకు దారితీసింది కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతక్కువలు అవినీతికి అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం అని భావిస్తున్నారు. ఈ స్థితిలో దీనిలో భాగస్వామ్యమైన అధికారులందరూ మూల్యం చెల్లించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

Exit mobile version