విధాత : శ్రీశైలం(Srisailam Dam)సహా ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద ఉధృతి కారణంగా నాగార్జున సాగర్ జలాశయం(Nagarjuna Sagar Dam Flood) నిండుకుండలా మారింది. ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో అధికారులు జలాశయం 14 గేట్లు పైకెత్తి(lift 14 gate).. దిగువకు నీరు విడుదల చేపట్టారు. ఇన్‌ఫ్లో 1,33,824 క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో 1,33,824 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.
పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు.. ప్రస్తుతం 589.70 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 311.44 టీఎంసీలుగా కొనసాగుతుంది. నాగార్జున సాగర్ గేట్లను ఎత్తడంతో సాగర్ క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు దూకుతున్న కృష్ణమ్మ పరవళ్లు(Krishna river) చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.
నిండుకుండలా మారిన నాగార్జున సాగర్
ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరదనీటితో నిండిన జలాశయం
దీంతో 14 గేట్లు పైకెత్తి.. దిగువకు నీరు విడుదల చేసిన అధికారులు
ఇన్‌ఫ్లో 1,33,824 క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో 1,33,824 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు.. ప్రస్తుతం 589.70… pic.twitter.com/idmJzNeczW
— PulseNewsBreaking (@pulsenewsbreak) September 7, 2025