Nilakanta Movie Review: నీలకంఠ మూవీ రివ్యూ

మాస్టర్ మహేంద్రన్ హీరోగా, యాశ్న ముత్తులూరి, నేహా పఠాన్ హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘నీలకంఠ’. రాకేష్ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో స్నేహా ఉల్లాల్ ప్రత్యేక గీతంలో మెరిసింది. రాంకీ, బబ్లూ పృథ్వీ, శుభలేఖ సుధాకర్, చిత్రం శీను, సత్యప్రకాశ్, అకాండ శివ, భరత్ రెడ్డి తదితర సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారు. L S ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మర్లపల్లి శ్రీనివాసులు, దివి వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ ఇనుమడుగు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. జనవరి 2, 2026న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ సినిమాను ఒక రోజు ముందే ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకులకు చూపించారు. మరి ‘నీలకంఠ’ ఎలా ఉందో చూద్దాం.

రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త ఆలోచనకు కమర్షియల్ టచ్

మాస్టర్ మహేంద్రన్ హీరోగా, యాశ్న ముత్తులూరి, నేహా పఠాన్ హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘నీలకంఠ’. రాకేష్ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో స్నేహా ఉల్లాల్ ప్రత్యేక గీతంలో మెరిసింది. రాంకీ, బబ్లూ పృథ్వీ, శుభలేఖ సుధాకర్, చిత్రం శీను, సత్యప్రకాశ్, అకాండ శివ, భరత్ రెడ్డి తదితర సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారు. L S ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మర్లపల్లి శ్రీనివాసులు, దివి వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ ఇనుమడుగు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. జనవరి 2, 2026న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ సినిమాను ఒక రోజు ముందే ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకులకు చూపించారు. మరి ‘నీలకంఠ’ ఎలా ఉందో చూద్దాం.

కథ

‘నీలకంఠ’ ఒక పీరియాడిక్ రూరల్ డ్రామా. సరస్వతిపురం అనే గ్రామంలో సంప్రదాయాలు, కట్టుబాట్లకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఆ గ్రామంలో తప్పు చేసిన వారికి గ్రామ పెద్ద రాఘవయ్య (రాంకీ) కఠినమైన శిక్షలు విధిస్తాడు. అదే ఊరిలో టైలర్‌గా జీవించే నాగభూషణం (కంచరపాలెం రాజు) కొడుకు నీలకంఠ (మాస్టర్ మహేంద్రన్). చదువులో చురుకైన వాడైన నీలకంఠ 10వ తరగతి చదువుతున్న సమయంలో ఒక తప్పు చేయడంతో, అతనికి ఊరు దాటి వెళ్లకూడదు, చదువు కొనసాగించకూడదు అనే కఠిన నిర్ణయం తీసుకుంటారు.

నీలకంఠకు తన చదువు, ప్రేమ రెండింటినీ కోల్పోయిన బాధ ఉంటుంది. అతను ఇష్టపడే సీత (యాశ్న ముత్తులూరి) ఊరి సర్పంచ్ (బబ్లూ పృథ్వీ) కూతురు. ఆమె ఉన్నత చదువుల కోసం ఊరు విడిచి వెళ్లిపోతుంది. తల్లి దగ్గర చదువుతోనే ఊరికి పేరు తీసుకొస్తానని మాట ఇచ్చిన నీలకంఠ ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నాననే బాధలో ఉంటాడు. చదువుకు దూరమైన నీలకంఠ కబడ్డీ ఆటలో తన ప్రతిభ చూపిస్తాడు. ఊరిలో జరిగే ప్రతి పోటీలో గెలుస్తున్నా, ఊరు దాటే అనుమతి లేక మండల స్థాయి పోటీల్లో పాల్గొనలేకపోతాడు. నీలకంఠ లేని సరస్వతిపురం జట్టు అక్కడ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది.

15 సంవత్సరాల తర్వాత సీత తిరిగి ఊరికి రావడం, సర్పంచ్ ఆమెకు పెళ్లి చేయాలనుకోవడం, అందుకు నీలకంఠ సర్పంచ్ పదవికే పోటీ చేసి సీతను పెళ్లి చేసుకుంటానని సవాల్ విసరడం కథను కీలక మలుపుకు తీసుకెళ్తాయి. ఒకప్పుడు దొంగగా చూసిన ఊరి ప్రజలు నీలకంఠను నాయకుడిగా అంగీకరిస్తారా? సరస్వతిపురాన్ని మండల స్థాయి కబడ్డీ విజేతగా ఎలా నిలబెడతాడు? తల్లికి ఇచ్చిన మాటను నీలకంఠ ఎలా నిలబెట్టుకుంటాడు? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ

ఈ సినిమాకు ప్రధాన బలమే కోర్ ఐడియా. ఇప్పటివరకు ఊరి నుంచి వెలివేయడం చూశాం, కానీ ఊరిలోనే ఉంచి వ్యక్తికి ఇష్టమైన దానిని దూరం చేయడం అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లేతో కథ మొదలవడం వల్ల మొదటి నుంచే ఆసక్తి పెరుగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో హీరో ఎమోషనల్ జర్నీ, లవ్ ట్రాక్, మెయిన్ కాన్ఫ్లిక్ట్‌ను బలంగా చూపించారు. ఇంటర్వెల్ బ్లాక్ సస్పెన్స్‌తో ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్ రేసీగా సాగుతూ యాక్షన్, కబడ్డీ ఎపిసోడ్స్ కొత్తగా డిజైన్ చేశారు. చివరి 30 నిమిషాల్లో కథకు ఇచ్చిన పే-ఆఫ్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో దర్శకుడు చెప్పాలనుకున్న మెసేజ్ స్పష్టంగా బయటపడుతుంది.

నటీనటులు & సాంకేతిక విభాగం

మాస్టర్ మహేంద్రన్ చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషన్, యాక్షన్ సన్నివేశాల్లో అనుభవజ్ఞుడిలా నటించాడు. యాశ్న ముత్తులూరి సీత పాత్రలో సహజంగా కనిపించింది. స్నేహా ఉల్లాల్ ప్రత్యేక గీతంలో గ్రేస్‌తో ఆకట్టుకుంది. రాంకీని చాలా రోజుల తర్వాత వెండితెరపై చూడటం మంచి ఫీల్ ఇచ్చింది. మిగతా నటులంతా కథకు తగ్గట్టుగా సహజ నటనతో సినిమాకు బలం చేకూర్చారు. దర్శకుడు రాకేష్ మాధవన్ తన ఆలోచనను స్పష్టంగా ప్రేక్షకుల వరకు తీసుకెళ్లడంలో విజయం సాధించాడు.

డైలాగ్స్ ప్రభావవంతంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ (శ్రవణ్ జి కుమార్) రిఫ్రెషింగ్‌గా అనిపిస్తాయి. మార్క్ ప్రశాంత్ సంగీతం వింటేజ్ ఫీల్ ఇస్తూ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన హైలైట్. ప్రొడక్షన్ డిజైన్ రియలిస్టిక్‌గా ఉంది. కొత్త నిర్మాతలైనా మర్లపల్లి శ్రీనివాసులు, దివి వేణుగోపాల్ కమర్షియల్ విలువలు తగ్గకుండా సినిమా తీయడంలో సక్సెస్ అయ్యారు. ‘నీలకంఠ’ ఒక మంచి రూరల్ కమర్షియల్ సినిమా. ఎమోషన్, యాక్షన్, స్పోర్ట్స్ డ్రామాను సమపాళ్లలో కలిపి ప్రేక్షకులకు కొత్త సంవత్సరం ఆరంభంలో మంచి అనుభూతిని అందిస్తుంది. కంటెంట్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకునే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. Rating 3/5

Latest News