Site icon vidhaatha

NTR| హైకోర్ట్‌ని ఆశ్ర‌యించిన జూనియ‌ర్ ఎన్టీఆర్.. కార‌ణం ఏంటంటే..!

NTR| వివాద ర‌హితుడిగా పేరు తెచ్చుకున్న జూనియ‌ర్ ఎన్టీఆర్ స‌డెన్‌గా హైకోర్టుని ఆశ్ర‌యించ‌డం ఇప్పుడు పెద్ద చ‌ర్చనీయాంశం అయింది. అయితే స్థ‌లానికి సంబంధించిన విష‌యంలోనే జూనియ‌ర్ హైకోర్ట్‌ని ఆశ్ర‌యించిన‌ట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ 2003లో గీత ల‌క్ష్మీ అనే యువ‌తి నుండి ప్లాట్ కొనుగోలు చేశారు. ఇది జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉంది. అయితే ఈ స్థ‌లం మీద గీత ల‌క్ష్మీ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్స్ తీసుకోవ‌డం అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మోర్ట్ గెజ్ ద్వారా గీతలక్ష్మి కుటుంబం లోన్స్ తీసుకున్నారు.

మూడు నాలుగు బ్యాంక్ ల నుంచి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఆమె లోన్ తీసుకోగా, జూనియర్ ఎన్టీఆర్ కు ఈ ప్రాపర్టీ అమ్మే సమయంలో విషయాన్ని గీత లక్ష్మి దాచిపెట్టింది. ఐదు బ్యాంకుల‌కి సంబంధించి లోన్ తీసుకోగా, తాను కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్ గేజ్ లోన్ తీసుకున్న‌ట్టు ఎన్టీఆర్‌కి చెప్పిందట‌. అయితే అప్పుడు చెన్నైలోని బ్యాంక్‌లో లోన్ క్లియ‌ర్ చేసి డాక్యుమెంట్ తీసుకున్నారు ఎన్టీఆర్. 2003 నుండి ప్లాట్ ఓన‌ర్‌గా తార‌క్ ఉండ‌గా, ఆ స‌మ‌యం నుండి బ్యాంక్ మేనేజ‌ర్స్‌తో వివాదం కొన‌సాగుతుంది. అయితే ఆ ప్రాప‌ర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ మేనేజ‌ర్స్ ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టుగా స‌మాచారం.

అయితే బ్యాంక్ మేనేజ‌ర్స్‌పై ఎన్టీఆర్ పోలీసుల‌కి కూడా ఫిర్యాదు చేశార‌ట‌. 2019 లో ఇదే వ్యవహారంలో పోలీసులు ఛార్జి షీట్ దాఖలు చేశారు. అయితే DRT లో జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆర్డర్ రావ‌డంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సి వ‌చ్చింది. దీంతో జూన్ 3 లోపు DRT డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమని హై కోర్టు ఆదేశించింది. జూన్ 6న విచారణ చేపడతామన్న హైకోర్టు తెలిపింది. ప్ర‌స్తుతం ఈ విష‌యం సినీ ఇండ‌స్ట్రీలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఎన్టీఆర్ ఇప్పుడు దేవ‌ర అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతుంది.

Exit mobile version